ఇప్పటికే కన్నడం సహా పలు ఇతర భాషల్లో విడుదలై, సూపర్ డూపర్ హిట్ ని సాధించిన కెజిఎఫ్ చాప్టర్ 1 సినిమా సీక్వెల్ గా రానున్న కెజిఎఫ్ చాప్టర్ 2 సినిమాపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలున్న విషయం తెలిసిందే. అత్యంత భారీ ఖర్చుతో హోంబలే ఫిలింస్ బ్యానర్ పై అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఇక హీరో యాష్ పోషించిన రాఖీ క్యారెక్టర్, చాప్టర్ 1 తో పోలిస్తే ఈ చాప్టర్ 2 లో మరింత అద్భుతంగా ఉంటుందని టాక్ వినిపిస్తోంది. ఇక ఈ సినిమాలో అధీర పాత్ర తాలూకు ఫస్ట్ లుక్ ని ఎల్లుండి అధికారికంగా ప్రకటిస్తామని నిన్న సినిమా యూనిట్ ఆ క్యారెక్టర్ ప్రీలుక్ పోస్టర్ విడుదల చేయడం జరిగింది. 

కేజీఎఫ్‌ చాఫ్టర్ 1లో అధీర పాత్ర ముఖాన్ని ప్రేక్షకులకు చూపించలేదు. కేవలం అతని చేతులు, దానికి ఉన్న సింహపు ఉంగరం చూపించి, అతని గొంతును మాత్రమే వినిపించడం జరిగింది. ఇక నిన్నటి ప్రీలుక్‌లో కూడా అదే సింహం ఉంగరాన్ని ధరించిన అధీర, చేతులు వెనక్కి పెట్టుకున్న ఫొటోను విడుదల చేసారు. కన్నడంతో పాటు, కొందరు తమిళ మరియు హిందీ నటులు కూడా ఈ సినిమాలోని కీలకపాత్రల్లో నటిస్తున్నట్లు సమాచారం. ఇక సినిమాలో కీలకంగా మారనున్న అధీర క్యారెక్టర్ లో ఖల్ నాయక్ గా బాలీవుడ్ ప్రేక్షకుల గుండెల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించిన సంజయ్ దత్ నటిస్తున్నట్లు నేడు కొన్ని మీడియా మద్యమాల్లో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. తన అన్న సూర్యవర్థన్‌ మాటకు కట్టుబడి అతని కొడుకు గరుడకు మద్దతుగా నిలుస్తాడు అధీర. 

గరుడను రాఖీ హత్య చేసిన విషయం తెలిసిన వెంటనే కేజీఎఫ్‌ను ఆక్రమించుకోవడానికి బయలుదేరిన అధీర, కేజీఎఫ్‌ను అధీర దక్కించుకున్నాడా, లేదా, అలానే అతడు రాఖీని ఏవిధంగా ఎదుర్కొన్నాడు తదితర విషయాలు తెలియాలంటే కేజీఎఫ్‌-చాప్టర్‌2 చూడాల్సిందే అంటోంది సినిమా యూనిట్. వాస్తవానికి ఈ క్యారెక్టర్ కోసం పలువురిని ఎన్నోవిధాలుగా పరిశీలించిన తరువాత చివరికి అంతటి పవర్ ఫుల్ పాత్రకు సంజయ్ అయితేనే న్యాయం చేయగలరని భావించి ఆయనను ఎంపిక చేసిందట సినిమా యూనిట్. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్తలో నిజానిజాలు ఎంతవరకు ఉన్నాయో తెలియాలంటే మాత్రం ఎల్లుండివరకు వేచిచూడక తప్పదు.....!! 


మరింత సమాచారం తెలుసుకోండి: