సెంటిమెంటే కాదు అద్భుతమైన కామెడీ టైమింగ్ ఉన్న హీరో విక్టరీ వెంకటేష్. ఆయన, వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలో అనీల్ రావిపూడి తెరకెక్కించిన సినిమా 'ఎఫ్ 2'. 2019 సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ ఫన్ అండ్ ప్రస్టేషన్ సూపర్ డూపర్ హిట్టయ్యింది. అంతేకాదు ఊహించని విధంగా 100 కోట్ల క్లబ్ లో చేరి అందరిని ఆశ్చర్య పరచింది. ఇక ఈ సినిమాలో పేరుకు తగ్గట్టుగానే కామెడీ పండింది.. సినిమా చూసిన జనాలు కడుపుబ్బా నవ్వుకుని బయటికొచ్చారు. అయితే అప్పుడు ఓన్లీ ఎఫ్-2 అంతే ఇప్పుడిక అంతకుమించి నవ్వించడానికి మరోసారి వెంకీ వచ్చేస్తున్నాడని లేటెస్ట్ అప్‌డేట్. 

అయితే ఈ సారి వరుణ్ తేజ్‌కు బదులుగా తన మేనల్లుడు నాగచైతన్యను వెంకీ వెంట తీసుకొస్తున్నారట. నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో చేయబోయే సినిమాకి సంబంధించి ఇప్పటికే స్క్రిప్ట్ కంప్లీటయిందని ఫ్రెష్ అప్‌డేట్. అన్నీ అనుకున్నట్లు జరిగితే 'వెంకీ మామ' షూటింగ్ పూర్తయ్యాక ఈ సినిమాని పట్టాలెక్కించే దిశగా ప్రయత్నాలు సాగుతున్నాయట. ఇందులో ఎఫ్‌2కు మించి కామెడీతో 'ఫుల్'గా నవ్వించేస్తారట ఈ ఇద్దరు హీరోలు.

ఇంతకముందు త్రినాథరావ్ తెరకెక్కించిన 'సినిమా చూపిస్తా మామ','నేను లోకల్' సినిమాల గురించి ప్రత్యేకంగా  చెప్పనక్కర్లేదు. ఈ రెండు సినిమాలు కమర్షియల్ గా మంచి సక్సస్ ను సాధించాయి. అయితే వెంకీతో తీయబోయే ఈ సినిమాలో కామెడీ పండి బాక్సాఫీస్‌ను షేక్ చేసి కలెక్షన్ల వర్షం  కురిపిస్తుందా..? లేదా అనేది తెలియాలంటే కొన్నాళ్ళు ఆగాల్సిందే. ఇక వెంకీ మామ సినిమాలోను వెంకీ, చైతు కలిసి నటిస్తున్నారు. ఈ సినిమాలో వెంకీ కి జోడీగా పాయల్ రాజ్ పుత్ నటిస్తుండగా చైతు కి జోడీగా రాశి ఖన్నా నటిస్తోంది. బాబీ దర్శకత్వం వహిస్తున్నాడు. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మిస్తుండగా థమన్ సంగీతమందిస్తున్నాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: