తమిళ హీరో సతీమణి జ్యోతిక సినిమాల్లోకి మళ్ళీ రీ-ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇలా ఆమె సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిందో లేదో.. వరసపెట్టి ఆఫర్స్ క్యూ కడుతున్నాయి. తాజాగా జ్యోతిక, మరో సీనియర్ రేవతి ప్రధాన పాత్రల్లో తమిళ దర్శకుడు కళ్యాణ్ రూపొందిస్తున్న చిత్రం ‘జాక్‌పాట్’.  అందుకు సంబంధించిన తెలుగు ట్రైలర్‌ను ఇవాళ విడుదల చేసింది చిత్ర యూనిట్.

శనివారం  ‘జాక్‌పాట్’ తెలుగు ఆడియోను విడుదల సందర్భంగా సూర్య, జ్యోతికతో పాటు  చిత్ర బృందం హాజరైంది. సూర్యా మాట్లాడుతూ తన సతీమణి జ్యోతిక నటించిన ఈ సినిమా కథ బాగా నచ్చిందని తమిళ స్టార్‌ సూర్య అన్నారు. నాకు, జ్యోతికకు చాలా ప్రత్యేకం. ముఖ్యంగా నాకు చాలా చాలా స్పెషల్. ఈ సినిమాను వేరే నిర్మాతలు ఎవరు తీసినా సరిగ్గా రాదేమో అనే భయంతో.. నేనే నా బ్యానర్‌పై నిర్మించాను.

మా బ్యానర్‌కి ఈ సినిమాతో మరో హిట్ రాబోతోందని నమ్ముతున్నా. అలానే ఈ సినిమాలో ఇద్దరు స్టార్స్ జ్యోతిక, రేవతిని చూస్తుంటే.. ఇద్దరు స్టార్ హీరోలు కలిసి మల్టీస్టారర్‌లో నటించారా? అనిపిస్తుంది. మా జ్యోతిక, రేవతి గారు యాక్షన్‌తోపాటు కామెడీని కూడా అద్భుతంగా పండించారు. నా సినిమాలని ఆదరిస్తూ నన్ను ప్రోత్సహిస్తున్న తెలుగు అభిమానులు.. ‘జాక్‌పాట్‌’ని హిట్ చేస్తారని ఆశిస్తున్నా’ అని చెప్పారు.

ఇది ఇలా ఉండగా ఈ మూవీ కేవలం 35 రోజుల్లోనే షూటింగ్ పూర్తి చేసుకోవడం విశేషం. తమిళనాట ఆగష్టు 2న విడుదల కానున్న ఈ సినిమాను సూర్య 2డి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నాడు. ఇకపోతే తెలుగులో రిలీజ్ డేట్ ఎప్పుడనేది ప్రకటించాల్సి ఉంది. ఆయన నిర్మించిన సినిమా ఇది. కల్యాణ్‌ దర్శకత్వం వహించారు. విశాల్‌ చంద్రశేఖర్‌ బాణీలు అందించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: