కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో కూడా అక్కడక్కడా కొన్ని సినిమాల్లో తళుక్కుమన్న ముద్దుగుమ్మ అమల పాల్, తెలుగు ప్రేక్షకుల్లో కూడా ఎందరో అభిమానులను సంపాదించుకుందనే చెప్పాలి. ఇటీవల తమిళ దర్శకుడు విజయ్ ని ప్రేమించి మరీ పెళ్లి చేసుకున్న అమల, పెళ్లి తరువాత వారిద్దరిమద్య కొన్ని అభిప్రాయబేధాల కారణంగా ఒకరినుండి మరొకరు విడాకులు తీసుకోవడం జరిగింది. 

తమ పెళ్లి విషయంలో జరిగినది తాను ఎప్పటికీ మర్చిపోలేనని, అయితే అటువంటి విషయాలను మర్చిపోవడానికి తనకు సినిమా ప్రొఫెషన్ ఎంతో సాయపడుతుందని అంటారు అమల. ఇక లేటెస్ట్ గా తమిళ్ లో ఆమె ప్రధాన పాత్రలో నటించిన సినిమా ఆడై. తెలుగులో ఆమె పేరుతో విడుదలైన ఈ సినిమా ఇక్కడ పర్వాలేదనిపించినా తమిళనాడులో మాత్రం ప్రస్తుతం మంచి సక్సెస్ సాధిస్తోందని అంటున్నారు సినిమా విశ్లేషకులు. సినిమాలోని కథ రీత్యా కొన్ని సన్నివేశాల్లో అమల పాల్ నగ్నంగా నటించడంతో సినిమాపై విమర్శలు వెల్లువెత్తాయి. ఇక ఈ సినిమా విడుదల సమయంలో అక్కడి మహిళా సంఘాలు పలు ధర్నాలు చేసి, సినిమా విడుదలను ఆపేయాలని కోరాయి. 

కొద్దిపాటి వివాదాల మధ్య ఎట్టకేలకు అక్కడ విడుదలైన ఆడై సినిమా, ప్రస్తుతం అద్భుతమైన కలెక్షన్స్ రాబడుతోందని సమాచారం. అంతేకాక అక్కడి మీడియా సంస్థలు ఆ సినిమాకు బాగా రేటింగ్స్ ఇవ్వడంతో అమల సహా సినిమా యూనిట్ సభ్యులందరూ ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారట. ఇక నటుడు విశాల్ తో పాటు పలువురు సినిమా ప్రముఖులు సైతం ఆడై సినిమాపై అలానే అమల నటనపై పొగడతలు కురిపిస్తున్నారు. మరి ఆ విధంగా సినిమాలో నగ్నంగా నటించినప్పటికీ అమల సినిమా అక్కడ ప్రేక్షకుల నీరాజనాలు అందుకుంటోంది అనే చెప్పాలి. ప్రస్తుతం  తమిళనాడులో మంచి కలెక్షన్స్ రాబడుతున్న ఈ సినిమా, రాబోయే రోజుల్లో మరింత రాబట్టే అవకాశం ఉందని అక్కడి సినిమా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి ఈ సినిమా రాబోయే రోజుల్లో అక్కడ ఎంతమేర కలెక్ట్ చేస్తుందో చూడాలి..!! 


మరింత సమాచారం తెలుసుకోండి: