ఇంగ్లీష్ పేపర్ లో వచ్చిన వార్తలపై సోషల్ మీడియాలో బన్నీ అభిమానులు ఆ వార్తా పత్రిక పై రాసిన రాతలపై మండిపడుతున్నారు. ప్రస్తుతం మీడియా రంగంలో చాలా వరకు తమ ప్రత్యర్థులపై ఏదో ఒకటి ఇష్టం వచ్చినట్లు రాతలు రాసి వార్తలు వైరల్ చేస్తుండటం మనం చూస్తూనే ఉన్నాం. ఇటువంటి క్రమంలో ప్రస్తుతం అల్లు అర్జున్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో చేస్తున్న సినిమా పై గత కొన్ని రోజుల నుండి ఇష్టానుసారంగా మీడియా రంగంలో పలు రకాల వార్తలు ఉద్దేశపూర్వకంగా సినిమాపై అంచనాలను తగ్గించాలనే విధంగా వార్తలు బయటకు వస్తున్న క్రమంలో సినిమా యూనిట్ వచ్చిన వార్తల పై మండిపడుతున్నారు.


ఈ విధంగానే ఇటీవల త్రివిక్రమ్ తీస్తున్న సినిమా కో డైరెక్టర్ తో అల్లు అర్జున్ కి గొడవ అయినట్లు...బన్నీ సీరియస్ అయి ఒకానొక సమయంలో ఆ కో-డైరెక్టర్ పై పేపర్లు కూడా విసిరినట్లు కొన్ని వార్తలు బయటకు రావడం జరిగాయి. ఇదంతా ఓ ఇంగ్లీష్ పేపర్ లో రావడంతో ..ఆ పేపర్ పై బన్నీ సీరియస్ అయినట్లు...ఎవరైతే ఆ వార్తలు రాశారో వారిపై ఎంక్వయిరీ చేసి తనదైన శైలిలో వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం.


అంతేకాకుండా ఇంగ్లీష్ పేపర్ సినిమా విడుదల కాకముందే ఈ సినిమా మరో బ్రహ్మోత్సవం అవుతుందని రాయటం తో బన్నీ 40 శాతం కూడా షూటింగ్ పూర్తి గాని సినిమా గురించి ఏంటా రాతలు అంటూ తీవ్రస్థాయిలో సదరు పత్రిక పై మండిపడినట్లు ఫిలింనగర్ లో వార్తలు వినబడుతున్నాయి. మరోపక్క ఈ సినిమాతో ఎలాగైనా హ్యాట్రిక్ కొట్టాలని త్రివిక్రమ్...అల్లు అర్జున్ ఈ సినిమా కోసం బాగా కష్టపడుతున్నారు...ఇటువంటి క్రమంలో దారుణమైన వార్తలు ఈ సినిమాపై రావటంతో అల్లు అర్జున్ సీరియస్ అవ్వటానికి కారణమట.


మరింత సమాచారం తెలుసుకోండి: