టాలీవుడ్ ఇండస్ట్రీ లో నందమూరి వంశం అంటే ఆ క్రేజే వేరు. దివంగత నందమూరి తారకరామారావు తర్వాత నందమూరి వంశాన్ని నిలబెట్టింది నందమూరి బాలకృష్ణ అని చెప్పటంలో ఎటువంటి సందేహం లేదు. ఒకపక్క అదే ఫ్యామిలీ నుండి జూనియర్ ఎన్టీఆర్ మరియు కళ్యాణ్ రామ్ ఇద్దరూ వచ్చిన నందమూరి బాలకృష్ణ వారసత్వాన్ని అందిపుచ్చుకుని ఆయన తనయుడు నందమూరి మోక్షజ్ఞ ఎప్పుడు సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడతారో అని చాలామంది ఇప్పటికే కళ్లు కాయలు కాసేటట్లు  ఎదురు చూస్తున్న విషయం అందరికీ తెలిసినదే.


నందమూరి బాలకృష్ణ తోటి హీరోలైన నాగార్జున..మరియు చిరంజీవి ఇలా వారి వారసుడు ఎంట్రీ ఇచ్చి దాదాపు కొన్ని సంవత్సరాలు గడుస్తున్నా గాని నందమూరి బాలకృష్ణ కొడుకు నందమూరి మోక్షజ్ఞ సిల్వర్ స్క్రీన్ పై ఎప్పుడు కనబడతారో అంటూ అప్పట్లో రకరకాల వార్తలు వచ్చిన క్రమంలో నందమూరి మోక్షజ్ఞ సినిమాల మీద కన్నా వ్యాపారాలపై ఎక్కువ దృష్టి పెట్టినట్లు అప్పట్లో ఓ టాక్ ఫిలింనగర్ లో వినబడింది. అయితే తాజాగా నందమూరి మోక్షజ్ఞ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ ఫోటోలో కనీసం హీరో కి తగ్గ పర్సనాలిటీ కనబడకపోవడంతో చాలామంది సోషల్ మీడియాలో నెటిజన్లు ఖచ్చితంగా నందమూరి మోక్షజ్ఞ సినిమాలు చేయడం కష్టమని ఆయన బిజినెస్ చేసే ఆలోచనలు ఉన్నట్లు వచ్చిన వార్తలు నిజమేనంటూ నందమూరి మోక్షజ్ఞ పై సెన్సేషనల్ కామెంట్స్ పెడుతున్నారు.


ఆ ఫోటో లో మోక్షజ్ఞ బాగా లావుగా పర్సనాలిటీ లో కనబడటంతో అందరూ షాక్ తిన్నారు. మరోపక్క నందమూరి బాలకృష్ణ కుర్రహీరోలకు తగ్గ విధంగా సీనియర్లకు అందని స్పీడులో ఒకపక్క రాజకీయ నాయకుడిగా వ్యవహరిస్తూ మరోపక్క వరుసగా సినిమాలు చేస్తున్న క్రమంలో...మోక్షజ్ఞ పై కూడా పెద్దగా ఫోకస్ నందమూరి అభిమానులు పెట్టడం లేదన్నట్టుగా ప్రస్తుతం కనిపిస్తోంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: