ప్రతి సినిమాకు మంచి టైటిల్ అవసరం. టైటిల్ ఎంత క్యాచీగా ఉంటే అంత బాగా సినిమా జనాల్లోకి వెళ్తుంది. అందుకే టైటిల్ విషయంలో పెద్ద కసరత్తే చేస్తూంటారు. దాదాపు ఇరవయ్యేళ్ల క్రితం జేడీ చక్రవర్తి హీరోగా రమణ దర్శకత్వంలో వచ్చిన ఓ సినిమాకు పేరు లేని సినిమా అంటూ  పబ్లిసిటీ చేసి జనాల్లోకి బాగా తీసుకెళ్లారు. ఇప్పుడంతా మెగాస్టార్ చిరంజీవి సినిమా టైటిల్స్ మీదే అందరూ ఫోకస్ చేస్తున్నారు.

 

చిరంజీవి సినిమా గ్యాంగ్ లీడర్ ఎంత ప్రభంజనం సృష్టించిందో టైటిల్ కూడా అంతే సంచలనం సృష్టించింది. సినిమా వచ్చి 28 ఏళ్లయినా ఇప్పటికీ ఫ్రెష్ గా ఉంటుంది. మెగాఫ్యాన్స్ నుంచి ఎంత వ్యతిరేకత వచ్చినా నానీ అదే టైటిల్ కి ఫిక్స్ అయ్యాడు. ఫిల్మ్ చాంబర్ రూల్స్ ప్రకారం పదేళ్లు దాటితే ఆ టైటిల్ ఎవరైనా పెట్టుకోవచ్చు. తాజా రాక్షసుడు అనే టైటిల్ ను బెల్లంకొండ సాయి సినిమాకు పెట్టారు. ఇప్పుడు చిరంజీవికి సూపర్ స్టార్ ఇమేజ్ తెచ్చిన ఖైదీ సినిమా పేరును కూడా వాడేస్తున్నారు. అదీ తెలుగు సినిమాకు కాదు. తమిళ డబ్బింగ్ సినిమాకు. చిరంజీవి అంటే ఖైదీ , ఖైదీ అంటేచిరంజీవి. అనేంతగా ఈ టైటిల్ కి పేరు. ఆ మధ్య మహేశ్ సినిమాకు ఈ టైటిల్ అన్నారు కానీ జరగలేదు.

 

ఖైదీ, గ్యాంగ్ లీడర్, జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమాల టైటిల్స్ విషయంలో చిరంజీవిని తప్ప మరొకరిని ఊహించలేం. కానీ అవి మావే అని అనలేరు. మరీ.. కాపీరైట్ చేయించుకుంటే తప్ప. శంకరాభరణం, దేవుడు చేసిన మనుషులు లాంటి క్లాసిక్ టైటిల్స్ ను రీప్లేస్ చేస్తే ఫలితం చూశాం. చిరంజీవి క్లాసిక్స్ జోలికి వెళ్లటమనేది వారికి ప్లస్ లా మారుతోంది. సినిమాలు కూడా ఆ స్థాయిలో ఉంటేనే ఇలాంటి ప్రయోగాలకు వెళ్లడం మంచిది.


మరింత సమాచారం తెలుసుకోండి: