వరుస ప్లాఫ్ లతో డీలా పడుతున్న జూనియర్ ఎన్టీఆర్ కు లక్కు కలసి రావడం లేదని టాలీవుడ్ లో అనుకుంటున్న విషయం తెలిసిందే. కారణం ఎన్నో అంచనాలు పెట్టుకున్న రామయ్యా వస్తావయ్యా కూడా ఆయనకు లక్కు లేదని తేల్చేసింది. అయితే ఎన్టీఆర్ తన లక్కును మార్చుకోవడం కోసం లక్కీ గాళ్ సమంత ఆయనకు మరో చాన్స్ ఇచ్చింది.

సమంత అంటే టాలీవుడ్ లో లక్కీ గాళ్ అని పేరుంది, ఆమె నటించిన సినిమాలన్నీ ఆ హీరోలకు హిట్లు ఇచ్చాయి. ఒక్క రామయ్యా వస్తావయ్యా సినిమానే ఆమెకున్న లక్కు ను ఎన్టీఆర్ కు ఇవ్వలేకపోయింది. అందుకే సమంత ఎన్టీఆర్ లక్కు మార్చడం కోసం వెంటనే మరో సినిమాలో ఆయనతో నటించడం మొదలు పెట్టింది. ఈ సినిమా షూటింగ్ కూడా రామోజి ఫిలింసిటీలో మొదలయిందట.

రామ్ కు ‘కందిరీగ’ వంటి హిట్టు అందించిన డైరెక్టర్ సంతోష్ శ్రీనివాస్ దీనిని డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమాకు నిర్మాత బెల్లంకొండ సురేష్. ఈ సారైనా సమంత లక్కు సెంటిమెంట్ వర్కవుట్ అయి ఎన్టీఆర్ లక్కు మారుతుందా అంటున్నారు టాలీవుడ్ జనాలు. పైగా ఈ సినిమా హిట్టుకోసం ఎంత ఖర్చయినా పెట్టాలని బెల్లంకొండ కూడా డిసైడ్ అయ్యాడట.

 

మరింత సమాచారం తెలుసుకోండి: