భార‌త దేశం అన్ని రంగాల్లో దూసుకుపోతున్న‌ది.  ర‌క్ష‌ణ రంగంలో ఇప్ప‌టికే అగ్ర‌గామిగా నిలిచింది.  వ్య‌వ‌సాయంలో ఎన్నో సంచ‌ల‌నాలు సృష్టిస్తోంది.  టెక్నాల‌జీ రంగంలో ఎన్నో నూత‌న విష‌యాల‌ను క‌నుగొంటూ.. ప్ర‌పంచానికి ద‌క్సూచిలా నిలుస్తోంది.  ఇప్పుడు ప్ర‌తి రంగంలో కూడా ఇండియా ముంద‌డుగు వేస్తూన్న సంగ‌తి తెలిసిందే. ముఖ్యంగా స్పేస్ విభాగంలో ఇండియా కొత్త‌కొత్త ప్ర‌యోగాల‌తో ప్ర‌పంచంలో టాప్ దేశాల స‌ర‌స‌న నిలిచింది.  

తాజాగా చంద‌మామ మీద‌కు ఉపగ్ర‌హాన్ని ప్ర‌యోగించి స‌క్సెస్ అయ్యింది ఇండియా.  ఇదేవిధంగా ఇప్పుడు మ‌రో రంగంలోకి అడుగు ముందుకు వేసేందుకు సిద్దం అయ్యింది.  అదే మ్యూజిక్ ప్ర‌యోగ‌శాల‌.  ప్ర‌పంచంలో రోజుకో కొత్తర‌కం వాయిద్యాలు పుట్టుకు వ‌స్తున్నాయి.  ర‌క‌ర‌కాల సంగీత విద్వాంసులు వాటిపై ప్ర‌యోగాలు చేస్తూ.. కొత్త‌కోత్త సంగీతాన్ని ప‌రిచ‌యం చేస్తున్నారు.  

అలా కొత్త ర‌కం సంగీతాన్ని ప్ర‌పంచానికి ప‌రిచయం చేయ‌డం వ‌ల‌న.. నూత‌న ఒర‌వ‌డికి తెర‌తీసిన‌ట్టు ఉంటుంది.  ప్ర‌పంచంలో త‌యారైన ప్ర‌తి వాయిద్యం అక్క‌డ అందుబాటులో ఉంటుంది.  ఆస‌క్తి ఉన్న వాళ్లు అక్క‌డికి వ‌చ్చి ప్ర‌యోగాలు చేసుకోవ‌చ్చు.  ఈ సంగీత ప్ర‌యోగశాల‌ను బెంగ‌ళూరు న‌గ‌రంలోని జేపీ రోడ్డులో నిన్న‌నే ప్రారంభించారు.  

ఇదిలా ఉంటే, సంగీతంలో ర‌క‌ర‌కాల ప్ర‌యోగాలు చేసినా, చేస్తున్న మ్యూజిక్ డైరెక్టర్స్ లో ఏఆర్ రెహ్మాన్ ముందు ఉంటారు.  ఆయ‌న ప్ర‌తి వాయిద్యంపై ప్ర‌యోగం చేశారు.  కొత్త‌కొత్త థ్వ‌నుల‌తో కూడిన సంగీతం ఇవ్వ‌డం రెహ్మ‌న్ కు వెన్న‌తో పెట్టిన విధ్య.  అందుకే ఆయ‌న స్టూడియో ఒక సంగీత ప్ర‌యోగ‌శాల అంటారు.  

సంగీత ప్ర‌పంచంలో రెహ్మాన్ చేసిన‌న్ని ప్ర‌యోగాలు ఇంకెవ‌రూ చేసుండ‌రంటే అతిశ‌యోక్తికాదు.  ఇళ‌య‌రాజా, రెహ్మాన్‌, కీర‌వాణి, మ‌ణిశ‌ర్మ, దేవిశ్రీ వంటి గొప్ప‌గొప్ప సంగీత ద‌ర్శ‌కులు బెంగళూరులోని ఆ సంగీత ప్ర‌యోగ‌శాల‌ను సంద‌ర్శించి ప్ర‌చారం క‌ల్పిస్తే... ప్ర‌తి ఒక్క‌రికి అది ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది అన‌డంలో సందేహం లేదు.. 


మరింత సమాచారం తెలుసుకోండి: