చెన్నై లో ఒక కాంక్రీట్‌ jungle లోని Slum లో ఇద్దరు పిల్లలు అమ్మ,నానమ్మ తో కలిసి ఉంటారు. వాళ్ళ నాన్న ఎదో కేస్‌ లో ఇరుక్కొని జైల్‌ లో ఉంటాడు. ఈ పిల్లలు స్కూల్‌ కి వెళ్లరు. ఎప్పుడు ఆడుకోవడం, రైల్వే ట్రాక్‌ పైన దొరికే బొగ్గు ని ఏరుకొని అమ్మి ఆ డబ్బు వారి అమ్మ కి ఇవ్వడం ఇదే వారి దినచర్య.


ఆ తల్లి ఆ డబ్బుని తండ్రి బెయిల్‌ కోసం దాస్తూ ఉంటుంది. ఆ ఇద్దరు పిల్లలకు కాకి గుడ్లు వెతికి, వాటిని గూళ్ల నుంచి తీసుకొని తినే అలవాటు ఉంటుంది. తమిళ్‌ నాడు ప్రభుత్వం రేషన్‌ కార్డ్‌ పైన టీవీ ఇస్తుంది. అలా వారింటికి ఒక టీవీ వస్తుంది. వారు టీవీ లో పాటలు, సినిమాలు చూస్తూ,కాలక్షేపం చేస్తుంటారు. ఒకరోజు టీవీ లో వచ్చే pizza add వారికి pizza  పైన ఇష్టం పెంచుకుంటారు.


అదే సమయంలో వాళ్ళు వుండే slum పక్కన పిజ్జా షాప్‌ ఓపెన్‌ అవుతుంది. దాని ధర 300 అని తెలిసి ఎలాగైనా 300 సంపాదించాలి అని అనుకుంటారు. రైల్వే ట్రాక్‌ పైన బొగ్గు ఏరుకొని అమ్మడం ద్వారా వచ్చే డబ్బును ఈ సారి వారి అమ్మకి ఇవ్వకుండా , కొన్ని రోజులు సేవ్‌ చేసి 300 సంపాదించి pizza షాప్‌ కి వెళ్తారు, కానీ వీరి డ్రెస్‌ లు చూసి వాచ్‌మెన్‌ లోనికి రానివ్వడు. వారు ఇద్దరు మళ్ళీ మంచి డ్రెస్‌ లు కోసం డబ్బు సేవ్‌ చేయడం మొదలు పెడతారు.


పిజ్జా మీద ఆ పిల్లల ఇష్టం కనిపెట్టి, వారి నానమ్మ దోస వేసి దాని పైన పిజ్జా ల  decorate చేసి ఇస్తుంది,వాళ్ళు అది తిని, ఇది కాదు అంటూ వెళ్లి పోతారు. చివరికి డబ్బులు సంపాదించి కొత్త డ్రెస్‌ లు కొనుక్కొని షాప్‌ కి వెళ్తారు. వీరిని చూసి %రశ్రీబఎ% లో ఉన్న పిల్లలు వారి వెంట షాప్‌ కి వెళ్తారు. ఈసారి వీరి ఇద్దరిని షాప్‌ ఓనర్‌ కొడతాడు, దాన్ని slum లో ఉండే ఒక పిల్లాడు రికార్డ్‌ చేస్తాడు. ఆ రికార్డ్‌ చేసిన వీడియో వైరల్‌ అయ్యి షాప్‌ ఓనర్‌ ని అందరూ తిడుతారు,కేస్‌ ఫైల్‌ అవుతుంది. చివరికి పోలీస్‌ లకి డబ్బు ఇచ్చి మీడియా ముందు ఆ పిల్లలని షాప్‌ కి తీసుక వచ్చి పిజ్జా ఇస్తారు. అది తిన్న పిల్లలు దీని కంటే మా నానమ్మ చేసినదే బాగుంది అని షాప్‌ నుంచి బయటికి వచ్చేస్తారు.

అంతే సినిమా . 

''జీవితంలో కొన్ని సాధించడం కోసం ఎన్నో కష్టాలు పడుతాము, దాన్ని కోసం కొందరిని బాధపెడుతాము, చివరికి అది అందుబాటులోకి వాచ్చాక, దీని కోసమా ఇంత కష్టపడింది, పాత జీవితమే బాగుంది అని అనుకుంటాము. ఈ చిన్న పాయింట్‌ మీదే తమిళ్‌ హీరో ధనుష్‌ Kaaka Muttai (కాకి గుడ్లు) అనే సినిమా తీసాడు ...'' అంటున్నారు సినీ విశ్లేషకులు అనామికా దేవి.

ఒక జీవిత సత్యాన్ని సున్నితంగా టచ్‌ చేసిన సినిమా ఇది. దీనిని చూడాలనుకుంటే, ఈ లింక్‌లోకి వెళ్లండి...https://www.hotstar.com/movies/kaaka-muttai/1000070415/watch

మరింత సమాచారం తెలుసుకోండి: