టాలీవుడ్ సినిమా పరిశ్రమకు అక్కినేని సుమంత్ హీరోగా రూపొందిన యువకుడు సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన భూమిక, ఆ సినిమా పెద్దగా సక్సెస్ కానప్పటికీ, తొలిసినిమాతోనే తెలుగు ప్రేక్షకుల గుండెల్లో మంచి స్థానాన్ని సంపాదించింది. ఆ తరువాత ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన ఖుషి సినిమాలో ఛాన్స్ సంపాదించిన భూమిక, అప్పట్లో ఆ సినిమా సూపర్ డూపర్ సెన్సేషనల్ హిట్ సాధించడంతో, అక్కడినుండి అప్పటి టాలీవుడ్ హీరోయిన్స్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారారు భూమిక. 

ఇక ఆపై మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మహేష్, యంగ్ టైగర్ ఎన్టీఆర్, యువ సామ్రాట్ నాగార్జున, విక్టరీ వెంకటేష్, ఇలా దాదాపుగా అందరు స్టార్ హీరోల సరసన నటించి సక్సెస్ఫుల్ హీరోయిన్ గా చాలారోజులపాటు కొనసాగిన భూమిక, ఒక్క యువరత్న బాలకృష్ణతో మాత్రం జతకట్టలేదు. ఇక ప్రస్తుతం బాలకృష్ణ హీరోగా సి. కళ్యాణ్ నిర్మాతగా కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో త్వరలో ప్రారంభం కాబోతున్న సినిమాలో ఒక ముఖ్య పాత్ర కోసం భూమిక ఎంపికైనట్లు కొన్ని టాలీవుడ్ వర్గాల సమాచారం. ఇకపోతే పాయల్ రాజ్ పుత్, సోనాల్ చౌహన్ ఇందులో హీరోయిన్స్ గా నటిస్తున్నారని అంటున్నారు. సరికొత్త కథ మరియు కథనాలతో మంచి యాక్షన్ మరియు ఎమోషనల్ జర్నీగా రూపొందబోయే ఈ సినిమాలో భూమిక క్యారెక్టర్ సినిమాను కీలక మలుపు తిప్పుతుందని టాక్. 

ఇక ఈ సినిమాలో నటించే ఇతర నటీనటులు మరియు సాంకేతికనిపుణుల వివరాలు అతిత్వరలో వెల్లడించనుంది సినిమా యూనిట్. అలానే హీరోయిన్స్ మరియు ముఖ్య పాత్రలో నటించబోయే భూమిక విషయమై కూడా ఆ సినిమా యూనిట్ నుండి అధికారిక ప్రకటన వెలువడనుందని అంటున్నారు. అతిత్వరలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించనున్న ఈ సినిమాను రాబోయే వేసవి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని యూనిట్ భావిస్తోంది. ఇక ప్రస్తుతం ఫిలిం నగర్ వర్గాల్లో విపరీతంగా చక్కర్లు కొడుతున్న ఈ న్యూస్ కనుక నిజమే అయితే, తొలిసారి బాలకృష్ణ సినిమాలో భూమికను మనం వీక్షించవచ్చు....!!

మరింత సమాచారం తెలుసుకోండి: