రాజ‌మౌళి ఆర్ ఆర్ ఆర్ మూవీ షూటింగ్ వేగంగా జ‌రుగుతున్న‌ది.  హైద‌రాబాద్‌లోని శివారులో ఏర్పాటు చేసిన సెట్స్ లో షూట్ చేస్తున్నారు.  ఎన్‌టీఆర్‌..చ‌ర‌ణ్ కు సంబందించి కీల‌క స‌న్నివేశాల చిత్రిక‌ర‌ణ జ‌రుగుతున్న‌ది.  ఇప్ప‌టికే సినిమాకు భారీ హైప్ వచ్చింది. రాజమౌళి సినిమాలంటేనే  భారీగా ఉంటాయి అనే విషయం అందరికి తెలిసిందే.  


ఈ సినిమా కోసం భారీగా ఖ‌ర్చు చేస్తున్నారు.  షెడ్యూల్ కు మ‌ద్య‌లో గ్యాప్‌లు ఎక్కువ‌గా వ‌స్తుండ‌టంతో సినిమా చిత్రిక‌ర‌ణ ఆల‌స్యం అవుతున్న‌ది.  ప్ర‌స్తుతం ఎన్‌టీఆర్... చ‌ర‌ణ్ ల‌కు సంబందించిన సీన్స్ షూట్ చేస్తున్నారు.  ఇద్ద‌రి మ‌ద్య వ‌చ్చే సీన్స్ చాలా కీల‌కం.   హైద‌రాబాద్ షెడ్యూల్ త‌రువాత లెక్క ప్ర‌కారం పూణేలో షూటింగ్ జ‌ర‌గాలి.  

కాని, మ‌హారాష్ట్ర‌లో వ‌ర్షాలు కురుస్తున్న సంద‌ర్బంగా.. పూణలో కాకుండా త‌మిళ‌నాడులో సినిమాను షూట్ చేయాల‌ని నిర్ణ‌యించుకున్నారు రాజ‌మౌళి.  కోమ‌రం భీమ్‌గా ఎన్‌టీఆర్, అల్లూరి సీతారామ రాజుగా చ‌ర‌ణ్ క‌నిపిస్తున్నారు.  చ‌రిత్ర ప్ర‌కారం తీసుకుంటే.. ఇద్ద‌రి మ‌ద్య ఎలాంటి సీన్స్ ఉండ‌వు.  

కానీ, సినిమాటిక్ కోసం రాజ‌మౌళి అలాంటి స‌న్నివేశాలు క‌ల్పించే ఉంటారు.  ఎన్‌టీఆర్‌...చ‌ర‌ణ్ ల మ‌ద్య సీన్స్ ఉంటేనే ప్రేక్ష‌కుల‌కు థ్రిల్ ఉంటుంది.  లేదంటే చ‌ప్ప‌గా ఉంటుంది.  ఎక్క‌డ ఎలాంటి స‌న్నివేశాలు పెట్టాలో రాజ‌మౌళికి బాగా తెలుసు.  ప్రేక్ష‌కుల నాడిని ప‌ట్టుకోవ‌డంలో ఇప్ప‌టివ‌ర‌కు స‌క్సెస్ అవుతూనే వ‌స్తున్నారు.  

ఆర్ ఆర్ ఆర్ లో కూడా అదే మాయ చేస్తార‌ని అంద‌రి అభిప్రాయం.  దాదాపు 400 కోట్ల రూపాయ‌ల బ‌డ్జెట్ తెర‌కెక్కుతున్న సినిమా కాబ‌ట్టి... జాగ్ర‌త్త‌గానే ప్లాన్ చేసి ఉంటారు.  రామ్ చ‌ర‌ణ్ కు జోడీగా అలియా భ‌ట్ న‌టిస్తున్న‌ది.  అజ‌య్ దేవ్‌గ‌ణ్ మ‌రో కీల‌క పాత్ర చేస్తున్నారు.  త‌మిళ‌న‌టుడు స‌ముద్ర‌ఖ‌నితో పాటు టాలీవుడ్ కు చెందిన కొంత‌మంది హీరోయిన్లు కూడా ఇందులో న‌టిస్తుండ‌టం విషేషం.  


మరింత సమాచారం తెలుసుకోండి: