మంచికో, చెడుకో బాహుబ‌లి తెలుగు సినిమా స్థాయిని పెంచింది.. అంతేకాదు ప్ర‌పంచ వ్యాప్తంగా తెలుగు సినిమా గురించి చెప్పుకునేలే చేసింది.. అదే బాట‌లో భారీ బడ్జెట్‌ సినిమాలు తెలుగులో నిర్మాణం జ‌ర‌గ‌డం మొద‌లైంది... చిరంజీవి రీ ఎంట్రీ 150 సినిమా భారీ విజ‌యాన్ని అందుకుంది.. ఇపుడు  చారిత్రాత్మ‌క సినిమాగా 151 సినిమా రూపొందుతుంది.. షూటింగ్ పూర్త‌య్యి పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు చేసుకుంటున్న‌ది.. ఇంత భారీ సినిమాకు పెట్టుబ‌డులు రావాలంటే రిలీజు గ్రాండ్ గా ఉండాలి.. ఆ త‌ర‌హాలో బిజినెస్ కావాలి అంటే ప్ర‌మోష‌న్ రిచ్‌గా ఉండాలి క‌దా... అందుకే సైరా నిర్మాత రామ్ చ‌ర‌ణ్ ఈసినిమా ట్రైల‌ర్ ను ఖ‌త‌ర్ లో వ‌చ్చే నెల జ‌ర‌గ‌బోవు సైమా వేదిక పై చేయాల‌ని సంక‌ల్పించిన‌ట్టు తెలుస్తున్న‌ది...ఈ సినిమా గురించి ట్రైల‌ర్ గురించి ప్ర‌పంచ‌మంత‌టా అక్టోబ‌ర్ 2 వ‌తేదీ రిలీజు వ‌ర‌కూ మాట్లాడుకోవాలని రామ్ చ‌ర‌ణ్ ఆకాంక్ష‌... బెస్ట్ ఆఫ్ ల‌క్ రామ్ చ‌ర‌ణ్‌... ఇదిలా ఉంటే...


తొలి తెలుగు స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత గాథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా కొణిదెల ప్రొడక్షన్స్ పతాకంపై రామ్ చరణ్ నిర్మిస్తున్నాడు. ఈ చిత్రంలో నయనతార కథానాయిక. అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా చిత్రం విడుదల కానుంది. చిత్ర ట్రైలర్ ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని అభిమానులు ఆసక్తికరంగా ఎదురు చూస్తుండగా, తాజాగా ఓ వార్త బయటికి వచ్చింది. ఖతార్ లోని దోహా వేదికగా ఆగస్టు 15వ తేదీన సౌత్ ఇండియా ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (సైమా)వేదిక ఘనంగా జరగనున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి చిరంజీవి ముఖ్య అతిధిగా హాజరు కానున్నారట. ఆ వేడుకలో చిత్ర ట్రైలర్ ని విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తుంది. హిందీతో పాటు సౌత్ లోని పలు భాషలలో విడుదల కానున్న సైరా మూవీ ట్రైలర్ ని ఇలాంటి అంతర్జాతీయ వేదిక ద్వారా ప్రమోట్ చేయడం సినిమాకు అనుకూలించే అంశమే అని అంటున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: