శ్రీ రెడ్డి ఎప్పుడు ఎం చేస్తుందో తెలీదు. అచ్చం రామ్ గోపాల్ వర్మలనే సోషల్ మీడియాలో ఎప్పుడు సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలుస్తుంటుంది శ్రీ రెడ్డి. ఆమె చేసే రచ్చ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, టాలీవుడ్ లో క్యాస్టింగ్ కౌచ్ అని గత సంవత్సరం చేసిన రచ్చ, యూట్యూబ్ వాళ్లకు ఇచ్చే ఇంటర్వ్యూ చర్చ ఇలా ఒకటి కాదు ఎన్నో చేసి టాలీవుడ్ సెలబ్రెటీస్ అందరికి పిచ్చెక్కించింది. కొణిదెల కుటుంబానికి, దగ్గుబాటి సురేష్ బాబు కుటుంబానికి అయితే చుక్కలు చూపించింది శ్రీ రెడ్డి.   


ఈ నేపథ్యంలోనే ప్రతి రోజు ఫేసుబుక్ లో పోస్ట్ చేస్తూ, ఎవరో ఒకరిని తిడుతూ, వాడు ఇలా .. వీడు ఇలా అని కామెంట్లు చేస్తూ ఫేసుబుక్ లో యాక్టీవ్ గా ఉంటుంది శ్రీ రెడ్డి. ఈరోజు అయితే ఫేసుబుక్ లో మరి యాక్టీవ్ గా కనిపిస్తుంది శ్రీ రెడ్డి. అందుకే ఉదయం హైదరాబాద్ సంచలనం ఉప్పల్ బాలుతో కలిసి డ్యాన్స్ చేసిన వీడియోని ఫేసుబుక్ లో పోస్ట్ చేసి సంచలనం సృష్టించింది.  


ఇప్పుడేమో సినీ రంగాన్ని, రాజకీయా రంగాన్ని ఒకటి చేసి మాట్లాడుతుంది శ్రీ రెడ్డి. బిగ్ బాస్ షో పై ప్రస్తావన తీసుకొచ్చి 'నాగార్జున గారికి తెలిసినన్ని రాజకీయాలు చంద్రబాబు గారికి కూడా తెలీవు .. డబ్బులు ఇస్తే బిగ్ బాస్ హీరో ఇవ్వకపోతే బిగ్ బాస్ గాడు ఒక ఎదవ' ఇలా అక్కినేని వారి పై పడింది శ్రీ రెడ్డి. మొన్నటికి మొన్న సమంతపై కూడా ఇలాంటి విమర్శ ఒకటి చేసి వార్తల్లో నిలిచింది శ్రీ రెడ్డి. మరి ఈ వ్యాఖ్యలపై అక్కినేని కుటుంబం, చంద్రబాబు, నారా లోకేష్ ఎలా స్పందిస్తారో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: