తెలుగు సినిమాలను రూపాయి కట్టలతో ముంచెత్తిన సినిమాలు ఇప్పటి తరానివే కావడం విశేషం. కలలో కూడా ఎన్నడూ ఊహించని తెలుగు ఇండస్ట్రీకి  ఈసినిమాలు దిమ్మతిరిగేలా చేసాయి. ఒక్కటి కాదు, రెండు కాదు, పదుల కోట్లలో కలెక్షన్లు సాదించి సౌత్ ఇండియా ఇండస్ట్రీకే కాదు, బాలీవుడ్ ను కూడా బెంబేలెత్తించాయి ఈ సినిమాలు అంటున్నారు.

బాక్సాఫీస్ రికార్డుల బద్దలు చేసిన టాప్ త్రీ కలెక్షన్లలో కూడా బాబాయ్ పవన్ కళ్యాణ్, అబ్బాయ్ రాంచరణ్ లే నిలచారు. మహేష్ బాబు నాలగు, అయిదు స్తానాలను సరిపెట్టుకోగా ప్రబాస్ ఆరోస్తానం, జూనియర్ ఎన్టీఆర్ ఏడో స్తానంలో నిలిచాడు. ఇప్పటికి వరకు అత్యదిక కలెక్షన్లు సాధించి నెంబర్ వన్ లో 73.2 కోట్లుతో పవన్ ‘అత్తారింటికి దారేది’ నిలిచింది. ఇక రెండో స్థానంలో 73 కోట్లతో రాంచరణ్ మగధీర ఉంది.

మూడో స్థానంలో 60.6 కోట్లతో  పవన్ ‘గబ్బర్ సింగ్’, నాలుగో స్తానంలో 56కోట్లతో మహేష్ ‘దూకుడు’, అయిదవ స్తానంలో మహేష్, వెంకటేష్ ల ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ 51 కోట్లతో నిలిచింది. ఇక ఆరవ స్తానంలో 48 కోట్లతో ప్రభాస్ మిర్చి, ఏడవ స్తానంలో 47 కోట్లతో ఎన్టీఆర్ బాద్ షా, ఎనిమిదవ స్తానంలో 46.6 కోట్లతో రాంచరణ్ నాయక్, తొమ్మిదవ స్తానంలోను 44.2 కోట్లతో రాంచరణ్ రచ్చ, పదవ స్తానంలో  43 కోట్లతో రాజమౌళి ఈగ నిలచింది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: