చార్మీ అంటే అందగత్తె. ఆ విషయం అందరికీ తెలిసిందే. తన అందంతో ఓ తరాన్ని వుర్రూతలూగించింది. టాప్ హీరోలందరి పక్కన నటించి శభాష్ అనిపించుకుంది. పదమూడేళ్ల ప్రాయంలోనే ఇండస్ట్రీకి వచ్చానంటున్న చార్మీ చాలా తక్కువ వయసులోనే నటనకు రిటైర్మెంట్ ఇచ్చింది. మూడు పదుల ఏజ్ దాటినా పెళ్ళి వూసు ఎత్తని ఈ ముద్దు గుమ్మ డేరింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ తో కలసి సినిమాలను ప్రొడ్యూస్ చేస్తోంది.


ఇందులో హిట్లు ఫట్లు పక్కన పెడితే పూరీతో ఆమె సినీ అనుబంధం అలా సాగిపోతోంది. లేటెస్ట్ గా ఈ ఇద్దరూ కలసి తీసిన చిత్రం ఇస్మార్ట్ శంకర్. ఈ సినిమాకు పెట్టిన పెట్టుబడికి నాలుగైదింతల సొమ్ము కలెక్షన్ల రూపంలో వస్తోంది. నిజంగా ఈ జంటకు ఇది ఆనందమే. ఎందుకంటే బాలయ్యతో పైసా వసూల్, పూరీ కొడుకుతో మెహబూబా వంటి సినిమాలను ఈ ఇద్దరూ తీశారు. అక్కడ బాగానే చేతులు కాలాయి.


చావో రేవో అన్నట్లుగా తీసిన ఇస్మార్ట్ శంకర్ సూపర్ హిట్ కావడంతో బాగానే డబ్బులు మిగిలాయట. అంతే కాదు, పాత ఫ్లాప్స్ లో పోయిన డబ్బులు కూడా ఇపుడు వచ్చేశాయట. ఇదిలా ఉండగా 'ఇస్మార్ట్‌ శంకర్‌'లో పెట్టుబడి పరంగా ఛార్మి షేర్‌ ఎక్కువ లేకపోయినా కానీ ఈ చిత్రానికి ప్రొడక్షన్‌ వ్యవహారం అంతా తానే చూసుకుంది. మనీ మేనేజ్‌మెంట్‌ అంతా ఛార్మిపైనే పూరి జగన్నాధ్‌ వదిలేయడంతో పారితోషికాల నుంచి బిజినెస్‌ వ్యవహారాల వరకు అన్నీ ఛార్మి చేతుల మీదుగానే నడిచాయి. 


ఈ చిత్రాన్ని తక్కువ బడ్జెట్‌లో పూర్తి చేయడానికి ఛార్మి కారణమని పూరీ కూడా అందరితో చెప్పేటంతగా ఆమె అతడిని మెప్పించింది.  ఖర్చులని విపరీతంగా తగ్గించగలిగిన ఛార్మిని ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌గా చేర్చుకోవడానికి పలు పెద్ద సంస్థలే ముందుకొస్తున్నాయని, ఇందు నిమిత్తం ఆమెకి కోట్లలో పారితోషికం కూడా ఆఫర్‌ చేస్తున్నాయని ఇండస్ట్రీలో వినిపిస్తోంది. చార్మీ హీరోయిన్ గా ఉన్నపుడు కూడా రాని డిమాండ్ ఇపుడు ఎగ్జిక్యూట్ ప్రొడ్యూసర్ గా వస్తోందిట.


అయినా తాను పూరీని వదిలివెళ్ళనని అంటోంది చార్మీ. ఇంత అందం ఉన్న మళ్ళీ వెండి తెర మీద నటనకు కూడా దూరమేనని చెబుతోంది. తాను హీరోయిన్ గానే రిటైర్ అయ్యానని, వేరే రోల్స్ చేయనని అంటోంది. సినిమా అంటే ఫ్యాషన్  కాబట్టే ప్రొడ్యూస్ చేస్తున్నానని కూడా చార్మీ గడుసుగా అంటోంది. ఇదిలా ఉండగా పూరీ, చార్మీ నిర్మాతలుగా బాలయ్యతో మరో మూవీకి రెడీ అవుతున్నారు. ఈసారి బాలయ్యకు మంచి హిట్ ఇవ్వాలని పూరీ కసి మీద మంచి స్టోరీ రాసుకున్నారట. ఇస్మార్ట్ శంకర్ హిట్ తో వూపు మీదున్న పూరీ బాలయ్యని ఒప్పిస్తే మాత్రం ఆయన మళ్ళీ ట్రాక్ లో పడినట్లే.


మరింత సమాచారం తెలుసుకోండి: