అమ్మాయిలు ఎన్ని ఫ్యాషన్ డ్రెస్సులు వేసినా చీరలో వచ్చే నిండుదనం, అందం వేరే డ్రెస్సుతో రానే రాదు.. చెంగావి రంగు చీర కట్టుకున్న చిన్నది...అంటూ సినీ కవులు వర్ణించినట్లుగా అందమైన మోడల్స్‌ సిల్క్‌ చీరలు కట్టుకుంటే మగువలు మరింత అందంగా కనిపిస్తారు.


టాక్సీవాలా తర్వాత పెద్దగా హిట్ సినిమాలు లేని ఈ భామ సోషల్ మీడియాలో మాత్రం హాట్ హాట్ ఫోటోలతో అందాల విందు చేస్తోంది. అందాల ఆరబోతతో కాస్త విసుగొచ్చిందేమో ఇలా నిండు చీరకట్టి సోషల్ మీడియాలో పోస్టు చేసింది.


చక్కనమ్మ చిక్కినా అందమే అంటారు. కానీ చీరకట్టులో అమ్మాయిలు కాస్త బొద్దుగా కనిపిస్తారు. అయినా సరే చీర కట్టులో ఆడవారు అందంగానే కనిపిస్తారు. చీరలు కాస్త ఖరీదు ఎక్కువే అయినా అందుకు తగిన హుందాతనం కూడా కనిపిస్తుంది.


ఎర్ర బ్లౌజుపై నల్ల చీరతో.. తెల్ల తెల్ల అందాలతో ఈ టాక్సీవాలా భామ కనువిందు చేస్తోంది. చూడగానే జిగేల్‌ మనేలా పార్టీ, ఫంక్షన్లలో ఎక్కడికెళ్లినా సరే...చీరలు తమ ప్రత్యేకతను చాటుకుంటాయని ఈ భామ మరోసారి గుర్తు చేస్తోంది.


చక్కటి చీర సెలెక్ట్ చేసుకుని కట్టుకోవాలే కానీ.. మగువలు చాలా అందంగా కనపడతారనడంలో అతిశయోక్తి లేదు. అసలే పాలరాతి శిల్పం లాంటి అందం.. దానికి తోడు నల్లచీర సొగసులు.. మొత్తానికి సొగసు చూడ తరమా అన్నట్టు లేదూ..


అందులోనూ.. ఈ చీరకట్టులో ప్రియాంక జవాల్కర్.. ఖుషీ సినిమాలోని భూమికను గుర్తు చేస్తోంది. అందంలో కాదు లెండి.. ఆ సినిమాలో నడుం డైలాగ్ గుర్తు తెచ్చేలా అందాల నడుము కనిపించీ కనిపించకుండా ఒయ్యారాలు ఒలకబోస్తోంది. ఓ ఫోటో షూట్ కోసం కాకుండా క్యాజువల్ గా కట్టుకున్నట్టు ఉన్నా.. ఈ ప్రియాంకా జవాల్కర్ కు ఈ నల్ల చీర బాగా నప్పింది. దీనికి తోడు లేలేత ఎండలో అందాలొలికిస్తూ నడుస్తున్న చిత్రం.. చాలా బాగా వచ్చింది.. మరి సినీ అవకాశాలు ఎలా వస్తాయో మరి.


మరింత సమాచారం తెలుసుకోండి: