విజయ్ దేవరకొండ అనుకున్నది సాధించాడు ‘డియర్ కామ్రేడ్’ మూవీని ఉమెన్ స్టార్ క్రికెటర్స్ చేత ప్రమోట్ చేయిస్తే ఈసినిమా మరింత అమ్మాయిలకు దగ్గర అవుతుందని భావిస్తూ వచ్చాడు. దీనికోసమే విజయ్ తన మీడియా ఛానల్స్ ఇంటర్వ్యూలు తగ్గించి కామ్రేడ్ కోసం కొత్త ప్రమోషాన్ పద్దతిని ప్రారంభించాడు.

ఈమూవీలో లిల్లీ పాత్రను పోషించిన రష్మికకు స్టార్ ఉమెన్ క్రికెటర్ గా ఎదగడానికి ప్రయత్నించే విషయంలో ఎదురైన లైంగిక వేధింపులు ప్రధాన అంశంగా ఈమూవీ సెకండ్ హాఫ్ కథ అల్లబడిన విషయం తెలిసిందే. ఈ విషయాల గురించి వాస్తవాలు మాట్లాడించడానికి ఏకంగా విజయ్ స్టార్ ఉమెన్ క్రికెటర్స్ ను రంగంలోకి దింపాడు. 

ప్రస్తుతం ఇండియన్ స్టార్ ఉమెన్ క్రికెటర్ గా పేరుగాంచిన మిధాలి రాజ్ ఈసినిమాను ప్రమోట్ చేస్తూ ఏర్పాటు చేయబడ్డ ఒక ప్రత్యేక సమావేశానికి అతిధిగా రావడమే కాకుండా ఈమూవీ పై విపరీతమైన ప్రసంసలు కురిపించింది. ఈ సమావేశానికి ఇంగ్లాండ్ డిప్యూటీ హై కమీషనర్ యండ్రూ ఫ్లెమింగ్ కూడ అతిధిగా వచ్చి ఈమూవీని ప్రమోట్ చేయడంతో ఈమూవీ ప్రమోషన్ లో మరొక ఎత్తు ఎదిగింది. 

సామాజిక అంశాల పై చైతన్యం బాగా ఎచ్చుగా ఉండే విజయ్ దేవరకొండ నిన్న ఈ సినిమాను భాగ్యనగరంలోని కొంతమంది అనాథశరణాలయాలకు చెందిన పిల్లలకు చూపెట్టి వారితో కలిసి లంచ్ చేయడం విజయ్ లోని నిజమైన కామ్రేడ్ బయటపడ్డాడు. నిన్నటితో ముగిసిన వీకెండ్ తో ఈమూవీకి 20 కోట్లు నెట్ కలక్షన్స్ వచ్చిన పరిస్థుతులలో నేడు మొదటి సోమవారం ఈసినిమాకు అసలైన పరీక్ష ఎదురు కాబోతోంది. ఇప్పటికే ఈసినిమా నిడివి పై ఈమూవీ బయ్యర్ల నుండి ఒత్తిడి వస్తున్న పరిస్థితులలో నేటి రోజున ఈమూవీ కలక్షన్స్ ను బట్టి ఈమూవీని ట్రిమ్ చేసే విషయంలో ఒక నిర్ణయం తీసుకుంటారని టాక్..  


మరింత సమాచారం తెలుసుకోండి: