సోఫియా చౌదరి తెలుసా.. అని ఎవరినైనా అడిగితె.. ఆమెమన్నా ఇలియానా ఏమి తెలియడానికి అని ఎదురు ప్రశ్నిస్తారు.   అదే మహేష్ బాబు 1 నేనొక్కడినే సినిమాలో లండన్ బాబులు సాంగ్ లో డ్యాన్స్ చేసిన హీరోయిన్ ఎవరో తెలుసా అంటే.. హా ఎందుకు తెలియదు అంటారు.  సోఫియా చేసింది కొన్ని సినిమాలే.. అన్ని ఐటమ్స్ స్పెషలిస్ట్ గా పేరుంది.  


అందుకే మంచి మసాలా సాంగ్ ఉంటె అందులో సోఫియాను తీసుకుంటుంటారు.  సోఫియా మన ఇండియన్ అమ్మాయి కాదు.  బ్రిటిష్ ఇండియన్.  విదేశీ పాప కావడంతో.. అందాలు ఆరబోసేందుకు సిద్ధంగా ఉంటుంది.  పైగా ఈ అమ్మడు మల్టీ టాలెంటడ్ హీరోయిన్.  సూపర్ సింగర్.. కిరాక్ డ్యాన్సర్.  ఎం టీవీ వీజేగా తన కెరీర్ ప్రారంభించి ఇప్పుడు బాలీవుడ్ లో సెటిల్ అయింది.  ఇక సోషల్ మీడియా తాట తీయడంలో స్పెషలిస్టు.


తాజాగా తన ఇన్స్టా ఖాతా ద్వారా రెండు ఫోటోలు పోస్ట్ చేసింది సోఫీ.  ఈ ఫోటోలకు "మీకు నా అవసరం ఉంటే.. నేనెక్కడ ఉన్నానో మీరు కనుక్కోగలరు" అంటూ క్యాప్షన్ ఇచ్చింది. నిజమే మన అవసరం లేకపోతే దూరంగా ఉంటారు కానీ మన అవసరం ఉంటే హచ్చి కుక్కలా వెనకాలే తిరుగుతారు కదా జనాలు!  భలే ఫిలాసఫీ చెప్పింది సోఫీ.  


ఇక ఫోటోల విషయానికి వస్తే బ్లాక్ మోనోకిని ధరించి సముద్రం ఒడ్డున ఉన్న వుడన్ ర్యాంప్ పై వెల్లకిలా పడుకుంది. కళ్ళకు స్టైలిష్ గాగుల్స్ ధరించి.. ఖజురహో శిల్పానికి లేటెస్ట్ గ్లామర్ వేర్ అప్డేట్ చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంది. మరో ఫోటోలో క్లోజప్ షాట్.  అందాలు దూరంగా ఉంటేనే తట్టుకోలేరు.. ఇక క్లోజప్ లో చూపిస్తే నెటిజన్ల పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పండి.  


ఆమె పోస్ట్ చేసే ఒక్కొక్క ఫోటోలు లక్షల్లో లైకులు షేర్లు వస్తుంటాయి. బాలీవుడ్ లో సెటిల్ అయినా ఏదో ఒక సమయంలో రిటైర్ అవ్వాల్సిందే కదా.  మరి రిటైర్ అయ్యాక డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి.  అందుకే అందం ఉన్నప్పుడే దాన్ని ఇలా మార్కెట్ చేసుకొని రెండు చేతులా సంపాదించుకుంటోంది. 

టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాక నెటిజన్లకు జేబులు గల్లా.. సెలెబ్రిటీల బ్యాంక్ అకౌంట్లో మాత్రం ఫుల్ కౌంట్.  అందుకే సెలెబ్రిటీలుగా మారడానికే ప్రతి ఒక్కరు ప్రయత్నిస్తున్నారు.  తెరపై ఉంది సంపాదించుకోవడానికి కాదు.. ఇలా సోషల్ మీడియాలో సంపాదించుకొని సెటిల్ కావటానికి ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: