అల్లు అర్జున్.. త్రివిక్రమ్ కాంబినేషన్లో మూడో సినిమా తెరకెక్కుతోంది.  ఈ కాంబినేషన్లో వచ్చిన రెండు సినిమాలు సూపర్ హిట్టయ్యాయి. మూడో సినిమాపై కూడా ఎన్నో అంచనాలు ఉన్నాయి. సెకండ్ షెడ్యూల్ వేగంగా జరుగుతున్నది. ఎప్పుడు లేని విధంగా బన్నీపై కొన్ని సెట్స్ లో కొన్ని వివాదాలు కూడా నెలకొన్నయి.  ఇది వేరే విషయం అనుకోండి.  


దీంతో పాటు బన్నీ.. త్రివిక్రమ్ సినిమా డిజాస్టర్ అవుతుందని బయట నెగెటివ్ టాక్ ప్రచారం జరిగింది.  దీనిపై యూనిట్ స్పందించి... ఎలా ఉంటుందో సినిమా రిలీజ్ అయ్యాక మాట్లాడాలని చురకలు అంటించింది.  ప్రస్తుతం షూటింగ్ ను వేగంగా చేస్తున్నారు.  అక్టోబర్ నాటికి షూటింగ్ కంప్లీట్ చేయాలని లక్ష్యంగా పెట్టుకొని పనిచేస్తున్నారు.  


ఇదిలా ఉంటె, బన్నీ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్.  ఈమెతో పాటు మరో హీరోయిన్ కూడా ఇందులో ఉన్నది.  టబు స్పెషల్ రోల్ చేస్తున్నది.  ఫాదర్ సెంటిమెంట్ ఆధారంగా సినిమా తెరకెక్కుతున్నట్టు తెలుస్తోంది.  సినిమాకు సంబంధించిన కొన్ని కీలక విషయాలు బయటకు వచ్చాయి.  అవేంటో ఇప్పుడు చూద్దాం.  


త్రివిక్రమ్.. బన్నీ సినిమా ఫస్ట్ లుక్ ను ఆగష్టు 15 వ తేదీన స్వాతంత్ర దినోత్సవం రోజున రిలీజ్ చేయబోతున్నారు.  ఫస్ట్ లుక్ తో పటు ఆరోజున టైటిల్ కూడా రివీల్ అయ్యే అవకాశం ఉన్నది. ఇందులో అల్లు అర్జున్ ను ఎలా చూపించబోతున్నారు అనేదాని చుట్టే అందరి చూపులు ఉన్నాయి. బన్నీని కొత్తగా చూపించాలని ప్రతి దర్శకుడు అనుకుంటాడు. 

త్రివిక్రమ్ మాత్రం పాత్రకాదు, పాత్రలో ఉండే పెర్ఫార్మన్స్ ముఖ్యం అంటుంటాడు.  అందుకే పాత్రలు నార్మల్ గా ఉన్నా ఆ పాత్రల్లో ఇంటెన్స్ ఎక్కువగా ఉంటుంది.  అందుకే త్రివిక్రమ్ తో సినిమా చేయాలని హీరోలు ఎక్కువగా ప్రయత్నిస్తుంటారు.  ఈ సినిమా తరువాత అల్లు అర్జున్ వేణు శ్రీరామ్, సుకుమార్ సినిమాలు లైన్లో ఉన్నాయి.  


మరింత సమాచారం తెలుసుకోండి: