సినిమా రిలీజ్ డేట్ కోసం నిర్మాతలు కొబ్బరికాయ కొట్టే ముందే కొన్ని లెక్కలు వేసుకుంటారు. ఆరు-ఏడు నెలల ముందు ప్లాన్ చేసుకుంటే కానీ వారికి మార్కెట్ వర్కౌట్ కాదు. సరైన సీజన్ లో రిలీజ్ కాకపోవటంతో టాక్ బాగున్న సినిమాలు కూడా ఒక్కోసారి కలెక్షన్లు రావు. రామ్ చరణ్ నటించిన ధృవ సినిమా రిలీజ్ టైమ్ కి నోట్స్ బ్యాన్ జరిగింది. సినిమాకి హిట్ టాక్ పడి మంచి కలెక్షన్లు వచ్చినా అనుకున్నంతగా రీచ్ కాలేకపోయింది.

 

తెలుగు సినిమాను ఓసారి పరిశీలిస్తే 2009 నుంచి 2019 వరకు ప్రతి జూలై నెలలో ఒక బ్లాక్ బస్టర్ పడింది. కేవలం 2011, 2013 ఈ రెండు సంవత్సరాల్లో మాత్రమే జూలై రిలీజులున్నా ఏదీ బ్లాక్ బస్టర్ కాలేదు. ఇది యాధృచ్చికమే అయినా ఈ నెలలో హిట్స్ ఉంటున్నాయి. స్కూల్స్, కాలేజీలు ప్రారంభమైనా కూడా కలెక్షన్ల సునామా సృష్టించాయి. వీటిని వరుసగా పరిశీలిస్తే.. 2009లో మగధీర, 2010లో మర్యాదరామన్న, 2012లో ఈగ, 2014లో వెంకటేశ్ దృశ్యం, 2015లో ప్రభాస్ బాహుబలి-1, 2016లో విజయ్ దేవరకొండ పెళ్లిచూపులు, 2017లో వరుణ్ తేజ్ ఫిదా, 2018లో కార్తికేయ ఆర్ఎక్స్ 100, 2019లో రామ్ ఇస్మార్ట్ శంకర్.. ఇవన్నీ ఆయా సంవత్సరాల్లో జూలై నెలలోనే విడుదలై బ్లాక్ బస్టర్ హిట్స్ సాధించాయి.

 

గత పదేళ్ల జూలై నెల రికార్డు సృష్టించిన సినిమాలు ఇవి. వీటిలో మగధీర, బాహుబలి-1 ఇండస్ట్రీ హిట్లు సాధించగా మిగిలిన ఆరు సినిమాలు ఆయా హీరోల కెరీర్లో బెగ్గెస్ట్ హిట్స్ గా నిలిచాయి. మరి ఈ సెంటిమెంట్ ను చూస్తే 2020 జూలైలో ఆర్ఆర్ఆర్ రిలీజ్ కు గతంలోనే డేట్ లాక్ చేశారు. మరి ఈ సెంటిమెంట్ ఏమేరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: