ప్రభాస్ హీరోగా చేస్తున్న సాహో సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ వేగంగా జరుగుతున్నాయి.  ఇప్పటికే సినిమాకు సంబంధించిన ఫస్ట్ హాఫ్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కంప్లీట్ అయ్యినట్టు తెలుస్తోంది.  ఎంత డ్యూరేషన్ అన్నది తెలియాలి.  యాక్షన్ సినిమా కాబట్టి సినిమా మొత్తం రెండున్నర గంటల్లో ఉంటుందని సమాచారం.  సినిమాపై అంచనాలు మాత్రం రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి.  


ఈ మూవీకి సంబంధించిన కొన్ని కీలక విషయాలు ఇప్పుదు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.  అలాంటి వాటిల్లో ఒకటి ఆడియో, ప్రీ రిలీజ్ వేడుకకు సంబంధించిన విషయం.  సాహో ఆడియో వేడుకను ఎక్కడ నిర్వహించబోతున్నారు.  ప్రీ రిలీజ్ ఎక్కడ చేస్తారు అన్నది క్యూరియాసిటీగా మారింది. ప్రభాస్ నేషనల్ హీరో అయ్యాడు కాబట్టి, ప్రమోషన్ దేశవ్యాప్తంగా చేయాలి.  దానికోసం యూనిట్ ప్లాన్ చేస్తున్నది.  


ఆగష్టు 15 వ తేదీలోపు ఈ సినిమాకు సంబంధించిన ఒక ఈవెంట్ ను మొదట తెలుగు రాష్ట్రాల్లో జరపాలని అనుకుంటున్నారని వార్తలు వస్తున్నాయి.  రెండు తెలుగు రాష్ట్రాల్లో రెండు చోట్ల రెండు ఈవెంట్లు తప్పనిసరిగా చేయాలి.  ఆడియో, ప్రీ రిలీజ్ ఈవెంట్ లను రెండు తెలుగు రాష్ట్రాల్లో నిర్వహించాలని అనుకుంటున్నారు.  


ఇదిలా ఉంటె, తెలుగు రాష్ట్రాల తరువాత కర్ణాటక, కేరళ, తమిళనాడు, ముంబై, ఢిల్లీ నగరాలలో కూడా ఈవెంట్లు చేయాలని నిర్ణయించారు.  అయితే, ఈ ఈవెంట్లు ఎప్పుడు చేస్తారు ఎలా చేస్తారు అన్నది తెలియాల్సి ఉన్నది.  ఆగష్టు 30 వ తేదీన సినిమా రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే.  భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు కాబట్టి దీనిపై అంచనాలు భారీగా ఉన్నాయి.  


ఈ సినిమాను బాలీవుడ్ లో టిసిరీస్ సంస్థ రిలీజ్ చేస్తున్నది.  ఇప్పటి వరకు కేవలం ఒక్క సాంగ్ ను మాత్రమే రిలీజ్ చేశారు.  అది పార్ట్ సాంగ్.  హైవోల్టేజ్ ఎలక్ట్రిక్ మ్యూజిక్ తో సాంగ్ ఉన్నది.  పాటను తెలుగులో డబ్ చేసినట్టు ఉందిగానీ, డైరెక్ట్ గా తెలుగుపాటలా అనిపించలేదు.  మరి మిగతా సాంగ్స్ ఎలా ఉంటాయో చూడాలి.  ఎన్ని సాంగ్స్ ఉన్నాయనే విషయం కూడా ఇంకా తెలియాల్సి ఉంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: