లఘు చిత్రాల ద్వారా వెండితెరకు పరిచయం అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ప్రస్తుతం తెలుగులో ఉన్న కమెడియన్స్ లో చాలా మంది లఘు చిత్రాల్లో చేసినవారే. అయితే లఘు చిత్రాల నుండి వెండితెరకు హీరోయిన్ గా పరిచయం అయిన నటి రీతూ వర్మ.పెళ్ళి చూపులు సినిమాలో రీతూ వర్మ నటనకి మంచి పేరొచ్చింది. ఈ సినిమా తర్వాత రీతూ వర్మ ఒకటి రెండు తెలుగు సినిమాల్లో మాత్రమే కనిపించింది.


ఆ తర్వాత ఈ అమ్మడుకి తెలుగులో అవకాశాలు తగ్గిపొయాయి. కానీ ఆమె టాలెంటుని తమిళులు మాత్రం బాగానే గుర్తించారు.పెద్ద సినిమాల్లో అవకాశాలిచ్చారు. ఆమె ఆల్రెడీ విక్రమ్ సరసన ‘ధృవనక్షత్రం’ అనే సినిమాలో నటించింది. దురదృష్టం కొద్దీ ఆ చిత్రం విడుదలకు నోచుకోకుండా పక్కన పడిపోయింది. ఐతే రీతూ మరీ చింతించాల్సిన పని లేకుండా ఇప్పుడో క్రేజీ తమిళ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.


ఆ సినిమా పేరు కన్నుం కన్నుం కొలైయడిత్తాల్. మలయాళ క్రేజీ హీరో దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన చిత్రమిది. ఈ చిత్రాన్ని సౌత్‌లోని అన్ని భాషల్లోకి అనువదిస్తున్నారు. తెలుగులో ‘కనులు కనులను దోచాయంటే’ అంటూ ‘దొంగా దొంగా’లోని పాటను గుర్తు చేసే టైటిల్ పెట్టారు. ఇక దుల్కర్ పుట్టిన రోజు సందర్భంగా ఆదివారం రిలీజ్ చేసిన ట్రైలర్ లవ్ స్టోరీల్ని ఇష్టపడేవాళ్ల మనసు దోచేస్తోంది. చాలా ప్లెజెంట్‌గా.. సరదాగా సాగిపోయిందీ ట్రైలర్.


రీతూ చాలా ట్రెడిషనల్‌గా, అందంగా కనిపించి మెప్పించింది. చాలా వరకు రొమాంటిగ్గా సాగే సినిమాలో కొంచెం యాక్షన్ పార్ట్ కూడా ఉన్నట్లుంది. దర్శకుడు గౌతమ్ మీనన్ ఇందులో పోలీస్‌గా నెగెటివ్ రోల్ చేయడం విశేషం. దేసింగ్ పెరియసామి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని త్వరలోనే రిలీజ్ చేయబోతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: