ఆ మద్య టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ జరుగుతుందని..ఇక్కడ అమ్మాయిలకు అస్సలు సేఫ్ లేదని, నటించడానికి వచ్చిన యువతులను సినీ పరిశ్రమలో చిన్న నుంచి పెద్దల వరకు ట్రాప్ చేసి వాడుకోవాలని చూసేవారని..ఇలా ఎంతోమంది అమ్మాయిలు బలైపోయారని పెద్ద ఎత్తున ఉద్యమాన్నే తీసుకు వచ్చింది నటి శ్రీరెడ్డి.  ఆమె ఉద్యమం వెనుక ఇన్ టెన్షన్ బాగున్నా..తొందరపాటు మాటలు, ఎవరిపై పడితే వారిపై సంచలన వ్యాఖ్యలు చేయడంతో ఆమె ఉద్యమం మద్యలోనే నీరుగారిపోయింది.

ప్రస్తుతం చెన్నైలో తన సొంత యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని పలువురు సినీ తారలపై విమర్శలు చేస్తూ వస్తుంది.  తాజాగా శ్రీరెడ్డి మరోసారి సంచనల వ్యాఖ్యలు చేసింది. ఈ సారి రాజకీయ నేతలపైనో లేక..మరే వ్యాపారవేత్తలపైనో కాదు. ఈ గొడవలకు పోకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్లే.. టాలీవుడ్ హీరో కింగ్ నాగార్జుననే టార్గెట్ చేసింది. నాగార్జున గారికి తెలిసినన్ని పాలిటిక్స్ ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారికి కూడా తెలియవు. డబ్బిస్తే బిగ్ బాస్ హీరో... ఇవ్వకపోతే బిగ్ బాస్ ఒక వెధవ' అంటూ ఫేస్‌బుక్‌లో పోస్ట్ పెట్టారు.

గతంలో మీలో ఎవరు కోటీశ్వరుడు హూస్ట్ గా వ్యవహరించిన కింగ్ నాగార్జున ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 3 కి హూస్ట్ గా ఉన్న విషయం తెలిసిందే. అయిుతే బిగ్ బాస్‌లో కంటెస్టెంట్ గా వెళ్లాలంటే లైంగిక కోర్కె తీర్చాలని అడిగారంటూ శ్వేతారెడ్డి, గాయత్రి గుప్తా ఆరోపించారు. ఈ ముచ్చట ఏకంగా దేశరాజధాని ఢిల్లీ వరకు వెళ్లి ఫిర్యాదులు చేసిన విషయం తెలిసిందే. 

బిగ్ బాస్ సీజన్ 2 లో శ్రీరెడ్డిని తీసుకుంటారని టాక్ వచ్చినా అది జరగలేదు. బిగ్ బాస్ సీజన్ 3 లో శ్రీరెడ్డి కన్ఫామ్ అని తెగ వార్తలు వచ్చాయి. ఇప్పటికే ఇంటి సభ్యుల్లో హేమ నిన్న ఎలిమినేట్ అయ్యింది. ఆమె స్థానంలో వైల్డ్ కార్డ్ ఎంట్రీగా ట్రాన్స్ జెండర్ తమన్నా వచ్చింది. బిగ్ బాస్ 3 లో ఆ మద్య నాగార్జున్ ఎప్పుడైనా ఏదైనా జరగొచ్చు అన్నారు..అలాంటపుడు శ్రీరెడ్డి వ్యాఖ్యలు ఎంత వరకు ప్రభావం చూపిస్తాయో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: