న్యాచుర‌ల్ స్టార్ నాని న‌టిస్తున్న సినిమా `గ్యాంగ్ లీడ‌ర్‌`. ఈ సినిమాకు విక్రమ్ కె.కుమార్ దర్శకత్వం వ‌హిస్తున్నారు. ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా న‌టిస్తున్న ఈ సినిమా మైత్రీ మూవీమేకర్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. త‌న న్యాచుర‌ల్ యాక్టింగ్‌తో అంద‌రిని ఆక‌ట్టుకుంటోన్న నాని వ‌రుస హిట్ల‌తో దూసుకుపోతున్నాడు. ‘జెర్సీ’ హిట్‌ తర్వాత నాని నటిస్తున్న చిత్రమిది.


ఇప్ప‌టికే రిలీజ్ అయిన స్టిల్స్‌, టీజ‌ర్ ప్రేక్ష‌కుల‌ను బాగా ఆక‌ట్టుకున్నాయి. ఐదుగురు అమ్మాయిలు.. వాళ్ల గ్యాంగ్‌కి ఓ లీడర్‌.. ఐదు వేళ్లను మోసే అరచేతిలాగా, పాండవుల వెనకుండే కృష్ణుడిలా ఆ గ్యాంగ్‌ని చూసుకుంటుంటాడు అంటూ రిలీజ్ అయిన టిజ‌ర్‌కు మంచి క్రేజ్ వచ్చింది.  నిజానికి ఈ సినిమా ఆగ‌ష్టు 30కి విడుద‌ల కావాల్సి ఉంది. అయితే `సాహో` సినిమా ఆ రోజుకు ఫిక్స్ అవ్వ‌డంతో.. ఆ రోజు విడుద‌ల కాబోయే `గ్యాంగ్ లీడ‌ర్‌` వాయిదా ప‌డింది. 


ఇక ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా వంటి `జ‌ర్సీ` చిత్రం త‌ర్వాత నాని ఫుల్ లెంత్ ఎంటర్ టైనింగ్ ‘గ్యాంగ్ లీడర్’ సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాడు. అయితే ఈ సినిమా క‌థ‌ మొత్తం పెన్సిల్ గ్యాంగ్ చుట్టూ తిరుగుతుంది. ఈ సినిమాలో అయిదుగురు లేడీ క్యార‌క్టర్స్ ఉంటాయి. ఈ సినిమాలో నాని ఆ ఐదుగురు ఆడవాళ్లు కలిసి బ్యాంక్ రాబరీ చేయబోతున్నారట. 


అయితే యాక్షన్ సన్నివేశాలు లేకుండా బుద్ధి బ‌లంతో బ్యాంక్ లూటి చేస్తార‌ట‌. ఆ త‌ర్వాత ఏం జ‌రుగుతుంద‌న్న‌దే సెకండ్ హాఫ్‌లో ఉంటుంద‌ని స‌మాచారం. ఆసక్తికర కథాంశంతో ఈ సినిమాను రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో ప్రియాంక, శరణ్య, ప్రియదర్శి కీలక పాత్రల్లో కనిపిస్తారు. మ‌రి ఆగ‌స్టులో విడుద‌ల కాబోతున్న ఈ సినిమా నానికి ఎలాంటి హిట్ ఇస్తుందో ?  చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: