‘బిగ్ బాస్ 3’ సీజన్ షోకు వైల్డ్ కార్డ్ ఎంట్రీగా ట్రాన్స్ జెండర్ తమన్నా ఎంటర్ కావడంతో ఆమె గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలని అనేక మీడియా సంస్థలు ప్రయత్నాలు మొదలు పెట్టేసాయి. దీనితో ఆమె ప్రస్తుతం బిగ్ బాస్ షోకు టాప్ సెలెబ్రెటీగా మారిపోయింది. ఈమెకు సంబంధించిన వార్తలు ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు జరిగిన నాటి సమయం నుండి వైరల్ గా మారిన సందర్భం ఉంది. 

గత ఎన్నికలలో మంగళగిరి నుంచి పోటీ చేసింది. కృష్ణాజిల్లా అవనిగడ్డ ప్రాంతానికి చెందిన ఈమె చిన్నప్పటి నుండి సినిమాలలో రాణించాలని ఈమె డాన్స్ లో యాక్టింగ్ లో బాగా తర్ఫీదు తీసుకుంది. ఇంట్లో సామాన్య వ్యక్తిలా ఇంట్లో బ్రతక కూడదని తనకంటూ ఒక ప్రత్యేకమైన వ్యక్తిత్వాన్ని ఏర్పరుచుకోవాలని ఈమె చాల ప్రయత్నాలు చేసింది. 

హైదరాబాద్ లో సినిమా అవకాశాలు రాకపోవడంతో ఆమె ముంబాయి వెళ్ళి అక్కడ జాబ్ చేసుకుంటూ వికేర్ కంపెనీ ఏర్పాటు చేసిన ఫ్యాషన్ షోలో పాల్గొని సంచలనం సృష్టించింది. ఈమె గురించిన వార్తలు ప్రముఖ ఇంగ్లీష్ దిన పత్రిక టైమ్స్ ఆఫ్ ఇండియా కూడ చాల ప్రముఖంగా ప్రచురించింది అంటే ఈమె స్థాయి ఏమిటో తెలుస్తోంది. 

ఇది చాలదు అన్నట్లుగా శ్రీరెడ్డి చేసిన క్యాస్టింగ్ కోచ్ పోరాటానికి ఈమె మద్దతు కూడ ఇచ్చింది. ఇప్పుడు ‘బిగ్ బాస్’ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈమెకు ఒక తీరని కోరిక ఉంది. చిరంజీవి వీరాభిమాని అయిన ఈమె ఎప్పటికైనా చిరంజీవితో కలిసి స్టెప్ వేయాలని అన్నది చిరకాల కోరిక. ‘బిగ్ బాస్’ లో రానున్న రోజులలో ‘సైరా’ ను ప్రమోట్ చేస్తూ చిరంజీవి ఈషోకి వచ్చే ఆస్కారం ఉన్న పరిస్తుతులలో తమన్నా కోరికతీరే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది..


మరింత సమాచారం తెలుసుకోండి: