ఇంట్లో ఉంటే ఒకలా బయటకు వచ్చాక ఒకలా ప్రవర్తించడం బిగ్ బాస్ కంటెస్టంట్స్ కు కొత్తేమి కాదు. ముఖ్యంగా ఎలిమినేట్ అయిన ప్రతి కంటెస్టంట్ కుట్ర చేసి తనని షో నుండి పంపించేశారని చెబుతుంటారు. అలానే సీజన్ 3 మొదటి ఎలిమినేటర్ హేమ కూడా బయటకు వచ్చాక బిగ్ బాస్ పై సంచలన వ్యాఖ్యలు చేసింది. 


ఆదివారం ఎలిమినేట్ అయిన ఆమె నాగార్జున పక్కన ఉన్నప్పుడు తనకి ఆడియెన్స్ ఇచ్చిన ఈ ఫలితాన్ని గౌరవిస్తానని చెప్పుకొచ్చింది హేమ. కాని బయటకు వచ్చి ఈ వారం ఎపిసోడ్ చూసుకుందనుకుంటా కొత్త రాగం మొదలుపెట్టింది. బిగ్ బాస్ లో జరిగింది ఒకటైతే చూపించింది మరొకటని.. తనపై కుట్ర జరిగిందని చెబుతుంది హేమ. 


అందరు కావాలని తనని టార్గెట్ చేశారని అందుకే మొదటి వారమే తను ఎలిమినేట్ అయ్యానని అంటుంది. మరి ఇదేదో నాగార్జున పక్కన ఉన్నప్పుడే మాట్లాడితే బాగుండేది. అలా మాట్లాడకుండా ఇలా షో నుండి బయటకు వచ్చాక షో మీద సంచలన వ్యాఖ్యలు చేయడం ఏమాత్రం కరెక్ట్ కాదు. హౌజ్ లో అందరి కన్నా పెద్దదవడం వల్ల అందరు అక్కా అక్కా అన్నారు. దాన్ని ఆమె తోపు అన్నట్టు ఫీలై తనకు ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తే ఎలా ఊరుకుంటారు చెప్పండి.       


అందుకే ఆమెను మొదటి వారమే ఎలిమినేట్ చేసేశారు. హౌజ్ లో ఏం జరిగినా చూపించే గంట ఎపిసోడ్ తోనే ఆడియెన్స్ ఇంటి సభ్యుల గురించి ఓ నిర్ణయానికి వస్తారు. అందుకే హౌజ్ లోకి వెళ్లే ముందు అన్ని విషయాల గురించి ఆలోచించుకుని వెళ్లాలి. బయటకు వచ్చాక ఎన్ని మాటలు అన్నా సరే పట్టించుకునే వారు ఉండరు. హేమ కామెంట్స్ కు కౌంటర్స్ కూడా అదే రేంజ్ లో వస్తున్నాయి.   




మరింత సమాచారం తెలుసుకోండి: