రకుల్ ప్రీతి సింగ్ తెలుగులోకి వేంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా హిట్ అవ్వటంతో రకుల్ కు తెలుగులో వరుసగా పెద్ద హీరోల సరసన అవకాశాలు వెంట వెంటనే వచ్చాయి. ఈ అమ్మడి అదృష్టం బాగుండి ఈ పెద్ద హీరోల సరసన నటించిన సినిమాలు హిట్ అవ్వడంతో ఇక వెను దిరగలేదు. తక్కవ టైం లోనే తన ఖాతాలో ఎక్కువ హిట్స్ వేసుకొని స్టార్ హీరోయిన్ రేంజ్ కు ఎదిగింది. దీనితో ఆటోమాటిక్ గా ఈ పంజాబీ బ్యూటీకి ఫాలోయింగ్ భారీగా పెరిగింది. అయితే రకుల్ కు ఈ మధ్య ప్లాప్స్ రావటంతో అవకాశాలు బాగా తగ్గిపోయాయి. తెలుగులు ఒకటి అర సినిమాలో నటిస్తుంది. ఇదిలా ఉంటే రకుల్ సోషల్ మీడియాలో బాగా యాక్టీవ్. 



యమా స్పీడుగా ఫోటో షూట్లు చేస్తూ.. హాటు ఫోటోలు పోస్ట్ చేస్తూ ఎప్పుడూ లైమ్ లైట్ లో ఉంటుంది. తాజాగా మరోసారి తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా ఒక ఫోటో పోస్ట్ చేసింది.  ఈ ఫోటోకు "నా మాజా కోసం వేచి చూస్తున్నా.   మాజా విజయం వెనక ఉన్న అద్భుతమైన టీమ్ ను కలవడం చాలా సంతోషం" అంటూ క్యాప్షన్ ఇచ్చింది.  మాజా డ్రింక్ తో టై అప్ అయింది కాబట్టి మాజా గురించి నాలుగు మంచి ముక్కలు చెప్పింది. అంతే కాకుండా ఆరెంజ్ కలర్ గౌన్ లో మెరిసింది.. నియాన్ పింక్ కలర్ హీల్స్ తో తన స్టైలింగ్ ను పూర్తి చేసింది. 


ఈ డ్రెస్ లో అందాల విందేమీ చెయ్యలేదు కానీ హాట్ ఎక్స్ ప్రెషన్లు మాత్రం ఇచ్చింది.ఈ ఫోటోలకు ది వన్ అండ్ ఓన్లీ మంచు లక్ష్మి "టూమచ్ టు హ్యాండిల్ పాపా" అంటూ కామెంట్ పెట్టింది.  ఇక సాధారణ నెటిజన్లు కూడా తక్కువేమీ తినలేదు. "మాజా డ్రెస్..మజా ఆయా".. "గజబ్ హై మేరె జాన్".. "బ్యూటిఫుల్ క్వీన్" అంటూ పొగడ్తలతో చంపేశారు.  రకుల్ సినిమాల విషయానికి వస్తే అక్కినేని నాగార్జున కొత్త సినిమా 'మన్మథుడు 2' లో హీరోయిన్ గా నటిస్తోంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: