“రాక్షసన్” పేరుతో తమిళంలో మంచి హిట్ సాధించి ఇప్పుడు తెలుగులో రాక్షసుడుగా రాబోతుంది. తెలుగు రీమేక్ హక్కులు కోనేరు సత్యనారాయణ ఈ చిత్రాన్ని నిర్మించారు. మా అబ్బాయి హవీష్ తో గతంలో నిర్మించిన జీనియస్ చిత్రంలో యువతకి ఒక చక్కటి సందేశాన్నిచ్చాము అదే విధంగా తల్లితండ్రులు పిల్లల్ని జాగ్రత్తగా చూడాలని తెలియజేస్తున్నాం. బెల్లంకొండ శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ హీరోహీరోయిన్లుగా రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఆగష్టు 2న రిలీజ్ కానుంది. కాగా కోనేరు సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా సినిమా గురించి నిర్మాత కోనేరు సత్యనారాయణ వెల్లడించిన పలు ఆసక్తికర విశేషాలు మీ కోసం…
 
 కెఎల్ యూనివర్సిటీకి ఛైర్మన్ గా కొనసాగుతున్నారు.  నిర్మాణం వైపు రావడానికి కారణం...
దాదాపు నాలుగు దశాబ్ధాలుగా ఎడ్యుకేషన్ రంగంలో ఉన్నాను. మా కోనేరు లక్ష్మయ్య యూనివర్శిటీ నేషనల్ వైజ్ గా ఎంత పాపులరో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే సినీ నిర్మాణం వైపు రావడానికి కారణం మాత్రం మా అబ్బాయి హవీషే. కానీ సినీ నిర్మాణం వైపు గతంలోనే నాకు కొంత అనుభవం ఉంది. హవీష్ హీరోగా చేసిన ‘జీనియస్’ సినిమాకు పార్టనర్ గా ఉన్నాను. ఆ అనుభవంతోనే ఇప్పుడు ‘రాక్షసుడు’ సినిమా నిర్మాణం చేపట్టాను. ఒక విధంగా ఈ సినిమాతోనే పూర్తిస్థాయి నిర్మాతగా మారాను.
 
 ఈ సినిమాని నిర్మించడానికి కారణం...
తమిళంలో విజయవంతమైన “రాక్షసన్” సినిమాని ‘రాక్షసుడు’ పేరుతో తెలుగులోకి రీమేక్ చేస్తున్నాం. ముందు మా హవీష్ కోసం “రాక్షసన్” చూసాను. సినిమా నాకు చాలా బాగా నచ్చింది. అయితే అప్పటికే హవీష్ ఇలాంటి జోనర్ లోనే ఆల్ రెడీ ఓ సినిమా చేస్తున్నాడు. దాంతో బెల్లంకొండ శ్రీనివాస్ ను హీరోగా తీసుకున్నాము.
 
“రాక్షసన్” స్క్రిప్ట్ లో మార్పులు ...
లేదండి. డైరెక్టర్ రమేష్ వర్మకు నేను ఒక్కటే చెప్పాను. ‘రాక్షసన్’ స్క్రిప్ట్ లో ఒక్క అక్షరం కూడా మార్చొద్దు అని చెప్పాను. నిజానికి ఉన్నది ఉన్నట్లు తియ్యడం కూడా కష్టమే. అయితే ఆ స్క్రిప్ట్ కి తగ్గట్లుగానే అచ్చం అలాగే ‘రాక్షసుడు’ సినిమా వచ్చింది.
 
షూటింగ్ మొత్తం పూర్తయ్యాక కూడా రీషూట్ గురించి...
చిన్న చిన్న విషయాల్లో కూడా అస్సలు పొరపాట్లు జరగకూడదనే ఉద్దేశ్యంతోనే నేనే డైరెక్టర్ కి చెప్పి మళ్ళీ రీషూట్ చేయించాను. సినిమా పై అంత కేర్ తీసుకున్నాం.
 
‘రాక్షసుడు’ అనే టైటిల్ పెట్టడానికి కారణం ...
సినిమాకి తగ్గట్లే పెట్టాం. అయితే మన సినిమాల టైటిల్స్ అన్నీ హీరోని లేదా హీరోయిన్ ని దృష్టిలో పెట్టుకుని పెడతారు. కానీ ఈ సినిమాకి ఇలాంటి టైటిల్ పెట్టడానికి కారణం ఈ సినిమా కాన్సెప్టే.
 
హీరో బెల్లంకొండ శ్రీనివాస్ గురించి ...
బెల్లంకొండ శ్రీనివాస్ సినిమా నేను ఇంతకు ముందు ఒకే ఒక్క సినిమా చేశాను. ఈ కథకు తను బాగుంటాడని అనుకోని తనని హీరోగా తీసుకోవడం జరిగింది. నిజంగా శ్రీనివాస్ చాల బాగా నటించాడు. ఎమోషన్ని అండ్ యాక్షన్ని చాలా బాగా హ్యాండిల్ చేశాడు.
 
హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ ...
మొదట ఈ సినిమాలో హీరోయిన్ గా పెద్ద హీరోయిన్లను తీసుకోవాలనుకున్నాం. రాశి ఖన్నా లాంటి హీరోయిన్స్ తో కూడా మాట్లాడాము. కానీ అనుపమ పరమేశ్వరన్ తీసుకున్నాం. తను చాలా  బాగా నటించింది. సినిమాలో టీచర్ రోల్ లో నటించింది.
 
ఇప్పుడు సినీ నిర్మాణం పై మీ అభిప్రాయం...
ప్రీ ప్రొడక్షన్ అనేది పక్కాగా చెయ్యాలి. కథ కథనం మాటలే సినిమాకి మెయిన్. కానీ మనవాళ్ళు మాత్రం ఏదో హడావుడిగా కథ మాటలు రాయించుకోని ప్రొడక్షన్ కి వెళ్ళిపోతారు. అది పూర్తిగా రాంగ్. అలాగే పోస్ట్ ప్రొడక్షన్ కి సంబందించిన  వర్క్ కూడా చాలా క్లారిటీగా ఉండాలి. అదేవిధంగా సినిమా రిలీజ్ కూడా చాలా ముఖ్యం. అయితే నేను సినీ నిర్మాణం వైపు రావడానికి హవీష్ ఒక కారణం అయితే.. మరో కారణం ఎంటర్ టైన్మెంట్  యూనివర్సిటీ పెట్టాలనేది నా గోల్. అందుకే ఈ ఎంటర్ టైన్మెంట్ ఫీల్డ్ వచ్చాను.
 
తదుపరి చిత్రాల  గురించి ...
రెండు మూడు సినిమాలు ఉన్నాయి. అందులో మా అబ్బాయి హవీష్ తో కూడా ఓ సినిమా చేస్తున్నాము. ఇక ‘రాక్షసుడు’ సినిమా అందరికీ నచ్చుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: