బాలీవుడ్ లో క్రిష్ మూవీతో స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది ప్రియాంక చోప్రా.  మెగాపవర్ స్టార్ రాంచరణ్ నటించిన ‘తుఫాన్ ’మూవీలో హీరోయిన్ గా నటించింది.  ఓ వైపు హిందీలో నటిస్తూనే హాలీవుడ్ పై కన్ను వేసిన ఈ బ్యూటీ అక్కడ క్వాంటికో సీరియల్ లో నటించింది.  అప్పట్లో ఈ సీరియన్ లో హాట్ గా కనిపించి... బాత్ రూమ్ సీన్లలో రెచ్చిపోయిన ప్రియాంక చోప్రాపై ఎన్నో వివాదాలు చుట్టుముట్టాయి. 

అయినా తన పని తాను కూల్ గా చేసుకుంటూ వెళ్తున్ను ఈ గ్లోబల్‌స్టార్‌ ఆ మద్య తనకన్నా పది సంవత్సరాలు చిన్న వయసు గల పాప్‌ సింగర్‌ నిక్‌ జోనాస్‌ను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.  అయితే వీరిద్దరి మద్య ఆ మద్య అభిప్రాయ భేదాలు వచ్చాయని ఒక పత్రికలో వార్తలు రావడం దానిపై ప్రియాంక సీరియస్ కావడం.. జరిగింది.  అప్పటి నుంచి తాను తన భర్త ఎంతో అన్యోన్యంగా ఉన్నామని ప్రతి చిన్న విషయాన్ని షేర్ చేస్తుంది ప్రియాంక చోప్రా. 

క్షణం తీరిక దొరికినా తన భర్త నిక్‌తో షికారుకు చెక్కేస్తుంటుంది. ఇటీవల ఆమె 37వ వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంగా తన పుట్టినరోజు వేడుకను భర్తతో కలిసి మయామీలో గ్రాండ్‌గా సెలబ్రేట్‌ చేసుకుంది. తాజాగా ఆ బీచ్ లో నిక్ తో చేస్తున్న ఎంజాయ్ మెంట్ ఫోటోలో షేర్ చేసింది ప్రియాంక. అయితే ఆ యాచ్‌లో పింక్‌ రంగు స్విమ్‌ సూట్‌ వేసుకుని నిక్‌ ఒడిలో పడుకుని ఉండగా, నిక్‌ కాలుని ప్రియాంక పట్టుకున్న ఫొటో ఒకటి ఇంటర్‌నెట్‌లో వైరల్‌ అయింది. స్విమ్‌ సూట్‌లో హాట్‌హాట్‌గా కనిపించిన ప్రియాంకపై నెటిజన్లు విమర్శల వర్షం కురిపించారు. 

అయితే ఈ ఫోటోలపై విమర్శలు కూడా వస్తున్నాయి..ఇదేమైనా సినిమా షూట్ అనుకున్నావా..మొగుడిని వెంట వేసుకొని హాట్ ఫోటోలతో ఎవరిని రెచ్చగొట్టాలని అంటూ విమర్శలు వస్తున్నాయి. అయితే కొందరు మాత్రం అది ఆమె సొంత లైఫ్..ఎలాగైనా ఉండొచ్చు అంటూ కొట్టి పడేశారు. ఈ బర్త్‌డే సెలబ్రేషన్‌ మాత్రం ఎప్పటికీ మరచిపోలేననీ, నా స్వీట్‌ హార్ట్‌ (నిక్‌) ప్రత్యేకంగా ఈ ట్రీట్‌ ఇచ్చాడనీ, మా సెలబ్రేషన్‌ ఫొటోలు చూస్తే ఎవరైనా హా.. అనాల్సిందేనని ప్రియాంక అంటోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: