చిరంజీవి, ప్రభాస్, ఎన్టీఆర్, మహేష్ బాబు, రామ్ చరణ్, అల్లు అర్జున్..ప్రస్తుతం టాలీవుడ్ వంద కోట్ల మార్కెట్ ఉన్న హీరోలు వీళ్ళే. అయితే వీళ్ళ తర్వాత కనీసం యాభై కోట్ల మార్క్ దాటడానికి ఆ తరవాత మరే యంగ్ హీరోలు రావడంలేదు. ఇప్పుడు ఈ మార్క్ ను టచ్  చేయగలిగే మరో హీరో ఎవరు? కనీసం యాభై కోట్ల మార్కెట్ వున్న హీరోలు ఎవరన్నా వున్నారా? అని ఫిల్మ్ నగర్ లో రీసెంట్‌గా ఒక చర్చ మొదలైంది. నాని, శర్వానంద్, విజయ్ దేవరకొండ. వరుణ్ తేజ్ చైతన్య, అఖిల్, సాయిధరమ్, నితిన్ ఇలా లిస్ట్ చాలానే వుంది. అంతేకాదు మన టాలీవుడ్లో వున్నంత మంది యంగ్ హీరోలు ఇంకే భాషలోనూ లేరు అన్న సంగతి తెలిసిందే. కానీ ఎవ్వరూ ముఫైకోట్ల థియేటర్ మార్కెట్ దాటడంలేదు. నానికి ఒకటి రెండు సినిమాలు, విజయ్ కు ఒక సినిమా, వరుణ్ తేజ్ కు ఒకటి రెండు సినిమాలు మాత్రమే యాభై కోట్ల మార్క్ దాటాయి. 

అర్జున్ రెడ్డి, గీత గోవిందం సినిమాలతో ఇండస్ట్రీలో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న విజయ్ దేవరకొండ తెలుగు రాష్ట్రాల థియేటర్ హక్కులు పాతికకోట్లు దాటలేదు. ఇప్పుడు నాన్ థియెటర్ హక్కులు పెరిగాయి కాబట్టి, నాని, విజయ్ ల మీద ముఫై నుంచి ముఫై అయిదు కోట్ల వరకు పెట్టగలగుతున్నారు. నాని గ్యాంగ్ లీడర్ సినిమాకు యాభైకోట్లు, విజయ్ హీరో సినిమాకు యాభైకోట్లు పెడుతున్నారు అంటే కేవలం నాన్ థియేటర్ హక్కులను నమ్ముకునే. టాప్ హీరోల లాగా తెలుగు రాష్ట్రాల్లో 70 నుంచి 80కోట్ల రేంజ్ లో థియేటర్ హక్కులు పలికే పరిస్థితి లేదు. పోనీ అలా అని టాప్ డైరక్టర్లతో సినిమాలు చేస్తే పరిస్థితి మారుతుంది అని అనుకోవడానికి కూడా లేదు. 

నితిన్-తివిక్రమ్ కాంబినేషన్ లో సినిమా చేస్తే, నలభైకోట్ల మేరకు రావడం కష్టమయింది. పైగా టాప్ డైరక్టర్ల రెమ్యూనిరేషన్ తో యంగ్ హీరోల సినిమాల ప్రొడక్షన్ అయిపోయే పరిస్థితి. అందుకే టాప్ డైరక్టర్ లు ఈ యంగ్ హీరోల కాంబినేషన్ లు సెట్ చేయడానికి ఏ నిర్మాత కూడా ముందుకు రావడంలేదు. కాంబినేషన్ లేకుండా యంగ్ హీరోలు యాభైకోట్ల దాటే థియేటర్ మార్కెట్ తెచ్చుకోవడం కష్టం అవుతోంది. యంగ్ హీరోల తెలుగు రాష్ట్రాల థియేటర్ మార్కెట్ ప్రస్తుతానికి అయితే పాతిక కోట్లకే ఫిక్స్ అయిపోయినట్లు కనిపిస్తోంది. కాస్త దాటుదాం అనేసరికి ఓ ప్లాపు వచ్చి పడుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో టాలీవుడ్ నెక్స్ట్ 100 కోట్ల మార్కెట్ ఉన్న హీరో ఎవరు..? అన్న ప్రశ్న మొదలైంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: