ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ సెన్సేషనల్ డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కిస్తున్నRRR సినిమా షూటింగ్ చాలా శరవేగంగా సాగుతోంది. మొన్నటి వరకు ఈ సినిమాలో హీరోలుగా నటిస్తున్న రామ్ చరణ్ ఎన్టీఆర్ ఇద్దరు గాయాల పాలు కావడంతో దాదాపు కొన్ని రోజుల పాటు షూటింగ్ ఆగి పోవడం జరిగింది. దీంతో ఆ సమయంలో సినిమా పై రకరకాల వార్తలు సోషల్ మీడియాలో కనిపించాయి. సినిమా ఆగిపోయిందని ఇంకా మరొకటి మరొకటి అన్నట్టుగా వరుసగా RRR సినిమాపై లేనిపోని వార్తలు రావడంతో షూటింగ్ మొత్తం ఆగిపోయినట్లు వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవడంతో వెంటనే ప్రతిస్పందించిన సినిమా యూనిట్ సినిమా ఆగిపోలేదు అని క్లారిటీ ఇవ్వడం జరిగింది.


దీంతో ఆ తర్వాత కొన్ని రోజుల పాటు సినిమాలో కీలకమైన సన్నివేశాలను హైదరాబాదులో చిత్రీకరించడం జరిగింది. అయితే హైదరాబాద్ షెడ్యూల్ పూర్తి కావడంతో నార్త్ లో భారీ షెడ్యూల్ కు ప్లాన్ చేశారు. ముందుగా పుణేలో కీలకమైన సన్నివేశాలు తెరక్కించాలనుకున్నారు. కానీ తాజాగా రాజమౌళి ఆ ఆలోచన విరమించుకున్నట్లు తెలుస్తోంది. పూణే షెడ్యూల్ ని చెన్నైకి మార్చినట్లు వార్తలు వస్తున్నాయి. సడెన్ గా లొకేషన్ ఎందుకు చేంజ్ చేశారనే విషయంలో క్లారిటీ లేదు. చెన్నై షెడ్యూల్ లో ఎన్టీఆర్ నటించే సన్నివేశాలు ఎక్కువగా ఉంటాయట. దీనితో ఈ షెడ్యూల్ మొత్తం ఎన్టీఆర్ బిజీగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.


మరోపక్క సినిమాలో ఎన్టీఆర్ పక్కన హీరోయిన్ ఎవరో కూడా ఇంకా కన్ఫార్మ్ కాలేదు చాలా పేర్లు హాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న హీరోయిన్ల పేర్లు వినపడుతున్న రాజమౌళి మాత్రం ఇంకా ఎవరిని డిసైడ్ అయినట్లు వార్తలు ఇండస్ట్రీలో వినబడటం లేదు. తాజాగా ఇటీవల హాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన హీరోయిన్ డైసీ ఎడ్గార్ జోన్స్ పేరు వినబడగానే చివరిక్షణంలో సినిమాకి అంతా ఎక్కువ తేదీలు కేటాయించలేక అలాగే భారత్ లో వాతావరణం తన ఒంటికి పడదు అన్న నేపథ్యంలో రాజమౌళి ఇచ్చిన ఆఫర్ కి నో చెప్పినట్టు ఫిలింనగర్ లో వార్తలు వినబడుతున్నాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: