ప్రస్తుతం  బిగ్ బాస్ షోకి ఉన్న డిమాండ్..  ఇప్పుడు ఏ షోకి లేదు.   తెలుగు బుల్లితెర పై  ప్రేక్షకులు విశేషంగా  ఆకట్టుకుంటుంది  ఈ  షో.  అక్కినేని నాగార్జున హోస్ట్ గా  'బిగ్ బాస్ 3' మొదలు అయింది. మొత్తం 15 మంది పోటీదారులతో మొదలైన ఈ సీజన్ మొదటి నుంచే కాస్త రసవత్తరంగానే  సాగుతుంది. అందుకే  బిహ బాస్ అనగానే  తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులు  తక్షణమే  టీవీల ముందు వాలిపోతున్నారు.   అయితే తాజాగా ఈ షో నుండి ఎలిమినేట్ అయినటువంటి సినీ నటి హేమ, ఈ బిగ్ బాస్ 3 కార్యక్రమం పై సంచలనమైన వాఖ్యలు చేశారు. దానికితోడు ఈ షో లో హేమ కి వ్యతిరేకంగా ప్రజా తీర్పు చాలా బిన్నంగా వచ్చింది.


కాగా ఈ షో నుండి మొదటి ఎలిమినేషన్‌ ప్రక్రియలో భాగంగా నటి హేమ, ఈ షో నుండి ముందుగా ఎలిమినేట్ అయినా సంగతి మనకు తెలిసిందే. అయితే ఎప్పుడైతే హేమ ఈ షో నుండి బయటకు వచ్చిందో...  ‘తనను కావాలనే ఈ షో నుండి ఎలిమినేట్ చేశారని, బిగ్‌బాస్ హౌస్‌లో ఒకటి జరిగితే, బయటకు వేరేలా చూపించారని, అంతేకాకుండా తన చేతలు కమాండింగ్‌ అనిపించాయని, అయినప్పటికీ కూడా నేను నార్మల్‌గానే చెప్పానని హేమ పేర్కొన్నారు. అసలు వంటగది వల్లే హౌస్‌లో గొడవలు వచ్చాయని, అందరి మంచి గురించి నేను చెప్తే, నాకే చెడు జరిగిందని తెలిపారు. ఒకవైపు అక్క అంటూ మర్యాద ఇస్తూనే, మరొకవైపు తన వెనకాల  గోతులు తవ్వారని హేమ ఆరోపించారు. 


 హేమ సహజంగా ముక్కుసూటిగా మాట్లాడుతుంది. ఆ క్రమంలో ఆమె  వివాదాస్పద వ్యాఖ్యలు కూడా చేయడం ఇప్పటికే చాల సార్లు చూశాం.  మరి అలాంటి ఆమె బిగ్ బాస్ హౌస్  గురించి కూడా అలాగే మాట్లాడుతుంది అనుకోవడానికి లేదు. హేమ ఎంట్రీ పై  పెద్దగా బజ్ క్రియేట్ అవ్వలేదు. అందుకే హేమను ఎలిమేట్ చెయ్యాలని  బిగ్ బాస్ డిసైడ్ అయ్యారట.  



మరింత సమాచారం తెలుసుకోండి: