ఈమధ్య ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీ నుండి జగపతి బాబు తప్పుకున్న వార్త సృష్టించిన సంచలనాలు మరిచిపోకుండానే ఇప్పుడు రావ్ రమేశ్ అల్లు అర్జున్ త్రివిక్రమ్ ల మూవీ నుండి తప్పుకోవడం అత్యంత సంచలనంగా మారింది. త్రివిక్రమ్ సినిమాలలో రావ్ రమేశ్ కు కీలక పాత్రలు సృష్టించడం గత కొంతకాలంగా కొనసాగుతూనే ఉంది.

ఆ సాన్నిహిత్యంతోనే రావ్ రమేశ్ త్రివిక్రమ్ కు రెండు నెలల బల్క్ కాల్ షీట్స్ ఇచ్చినట్లు టాక్. అయితే రకరకాల కారణాలతో బన్నీ సినిమా షూటింగ్ వాయిదా పడుతూ నెమ్మదిగా కొనసాగిన నేపధ్యంలో ఇప్పుడు రావ్ రమేశ్ కు ఒక కొత్త సమస్య తెచ్చి పెట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. 

రావ్ రమేశ్ ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీలో కూడ నటిస్తున్న పరిస్థితులలో ఆసినిమాకు ఇతడు ఇచ్చిన డేట్స్ త్రివిక్రమ్ బన్నీలకు ఇచ్చిన డేట్స్ తో క్లాష్ అవుతున్నట్లు సమాచారం. దీనితో ఈ రెండు సినిమాలను కష్టపడి కొనసాగిస్తూ పూర్తి చేద్దామని రావ్ రమేశ్ ప్రయత్నిస్తున్నా త్రివిక్రమ్ తనకు బల్క్ డేట్స్ వరుసగా కావాలని పట్టుపట్టినట్లు తెలుస్తోంది. దీనితో రావ్ రమేష్ త్రివిక్రమ్ ల మధ్య చిన్న భేధాబిప్రాయాలు వచ్చినట్లు తెలుస్తోంది.

అయితే త్రివిక్రమ్ చెప్పిన కండిషన్స్ తో మహేష్ సినిమాను వదులుకోవడం ఇష్టం లేక ఇప్పుడు రావ్ రమేశ్ బన్నీ మూవీ నుండి పూర్తిగా తప్పుకున్నట్లు తెలుస్తోంది. ఈ అనుకోని సంఘటనకు షాక్ అయిన త్రివిక్రమ్ అతడి స్థానంలో ‘అమృతం’ ఫేమ్ హర్ష వర్ధన్ ను ఎంపిక చేసినట్లు వార్తలు వస్తున్నాయి. వాస్తవానికి బన్నీ మూవీలో రావ్ రమేశ్ పాత్ర చాల కీలకం అని తెలుస్తోంది. మరి ఇలాంటి కీలక పాత్రను హర్ష వర్ధన్ బాగా నటించి మెప్పించ గలిగితే పరోక్షంగా ఈ నటుడుకి రావ్ రమేశ్ వాకౌట్ అదృష్టంగా మారుతుంది అనుకోవాలి..


మరింత సమాచారం తెలుసుకోండి: