బాలీవుడ్ లో కబీర్ సింగ్ తో టాప్ స్థాయికి ఎదిగిన హీరోయిన్ కియారా.  ఈ మూవీ తరువాత ఆమె చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి.  మరికొన్ని కథలు వింటోంది.  అవి కూడా ఫైనల్ అయ్యే అవకాశాలు ఉన్నాయట.  కబీర్ సింగ్ విజయంలో హీరో షాహిద్ కపూర్ ఎంత కష్టపడ్డాడో, కియారా కూడా అంతే కష్టపడింది.  ఒకవిధంగా చెప్పాలి అంటే అంతకంటే ఇంకా ఎక్కువే కష్టపడింది.  


ఎందుకంటే, తెలుగులో అర్జున్ రెడ్డి సినిమా కంటే హిందీలో తెరకెక్కిన కబీర్ సింగ్ లోనే ముద్దులు ఎక్కువ.  అవికూడా ఘాటైన ముద్దులు.  కియారా ఆ ముద్దుల విషయంలో ఎలాంటి అడ్డంకులు చెప్పలేదు.  చెప్పకపోగా ఆమె నటించిన విధానం బాగుంది.  ఈ మూవీ సూపర్ హిట్ కావడంతో కరణ్ జోహార్ తన నెక్స్ట్ రెండు సినిమాల్లో కియారను బుక్ చేసుకున్నారు. 


ఇదిలా ఉంటె కియారా తనకు సంబంధించిన ప్రతి విషయంలో కూడా చాలా ఓపెన్ గా ఉంటుంది.  ఎలాంటి విషయమైనా స్పష్టంగా చెప్పేస్తుంది.  దాపరికం ఉండదు. ఇలాంటి వాటిల్లో తనకు కాబోయే భర్త గురించి కూడా స్పష్టంగా చెప్పింది.  తనకు నచ్చకుండా తనపై చేయి వేస్తె... భరించలేనని చెప్పింది.  అది ఎవరైనా సరే ఒకటే అని చెప్పింది.  ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకుంటా అని నిర్మొహమాటంగా చెప్పేసింది.  


ప్రేమ, పెళ్లి విషయాలు రెండు తనకు నచ్చిన వ్యక్తితోనే జరుగుతాయని, అయితే, తనకు నచ్చినపుడే ప్రేమిస్తానని, పెళ్లి చేసుకుంటానని అంటోంది. ఇలా ఇన్ని కండిషన్స్ పెడితే కియారాను ఎవరు ప్రేమిస్తారు చెప్పండి.  ప్రేమకు హద్దులు, కండిషన్స్ పెట్టుకుంటే.. అది ప్రేమ ఎలా అవుతుంది. కియారా ఆలోచనలు మెచ్యూర్ గానే ఉంటాయి కాబట్టి ఈ విషయంలో తన నిర్ణయాన్ని ఎవరు కాదనలేరు.  తెలుగులో భరత్ అనే నేను తో హిట్ కొట్టిన ఈ అమ్మడు, వినయ విధేయ రామ సినిమాలో ప్లాప్ ను మూటగట్టుకుంది. తెలుగులో మరలా సినిమా చేస్తుందా చూద్దాం.  


మరింత సమాచారం తెలుసుకోండి: