`అల్లుడు శీనుతో` చిత్రంతో 2014లో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన బెల్లంకొండ శ్రీ‌నివాస్ సరైన హిట్ కోసం చాలానే కష్టపడుతున్నాడు. బెల్ల‌కొండ శ్రీ‌నివాస్‌కు  సినిమాలు చేయ‌డానికి ఢోకా లేదు కాని.. వచ్చిన చిక్కల్లా హిట్ లేకపోవడమే. కొంతలో కొంత బోయపాటి డైరెక్షన్‌లో వచ్చిన ‘జయ జానకి నాయక’ సినిమా ఓ మోస్త‌రుగా ఉంద‌ని చెప్పాలి. ఈ సినిమా తప్పితే మిగతా సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద దారుణంగా విఫలం అయ్యాయి. ఇక తాజాగా వ‌చ్చిన `సీత‌` చిత్రం కూడా అట్ట‌ర్ ఫ్లాప్ అయిన సంగ‌తి తెలిసిందే.


ఇక ప్ర‌స్తుతం తమిళంలో హిట్టైన ‘రాచ్చసన్’ సినిమాను తెలుగులో ‘రాక్షసుడు’తో పేరుతో రీమేక్ చేశారు. తాజాగా విడుదలైన ‘రాక్షసుడు’ టీజర్‌.. బెల్లంకొండ గత చిత్రాలకు భిన్నంగా ఉంది. ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకుంది. ‘U/A ‘ సర్టిఫికెట్‌ తెచ్చుకుంది.  సైకో మర్డర్ మిస్టరీ నేపథ్యంలో సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమా టీజర్ ఇంట్రస్టింగ్‌గా ఉంది. అమ్మాయిలను చంపే సైకో.. అతని పట్టుకోవడానికి ఒక పోలీస్ టీమ్.. ఇంతకీ ఈ సైకో ఎందుకు అమ్మాయిలను చంపుతాడు? అనే దానిపై స్టోరి ఉండ‌నుంద‌ని తెలుస్తోంది. సినిమాకు సెన్సార్ రిపోర్ట్ త‌ర్వాత మంచి టాక్ వ‌చ్చింది.


బెల్లంకొండ శ్రీనివాస్ సైకో కిల్లర్ కేసు ని ఇన్వెస్టిగేట్ చేసే పోలీస్ ఆఫీస‌ర్‌గా కనిపిస్తున్నారు. రమేష్ వర్మ డైెరెక్ట్ చేసిన ఈ సినిమాలో బెల్లంకొండ సరసన అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రాన్ని ‘ఏ స్టూడియోస్’, అభిషేక్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.  ‘కవచం’ తర్వాత బెల్లంకొండ శ్రీనివాస్  ఈ చిత్రంలో మరోసారి పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించాడు. మ‌రి ప్ర‌పంచ వ్యాప్తంగా  ఆగస్టు 2న విడుద‌ల కాబోతున్న ఈ సినిమాతో అయినా బెల్లంకొండ శ్రీ‌నివాస్ హిట్ కొడ‌తాడో? లేదో? చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: