‘గ్యాంగ్ లీడర్’ మూవీ టీజర్ వచ్చాక  ఆమూవీ అంచనాలు పెరిగిపోయాయి. ఐదుగురు  మహిళలతో నాని చేసే రివెంజ్ డ్రామాగా క్లారిటీ రావడంతో ఈ మూవీ సబ్జెక్ట్ ఒక డిఫెరెంట్ జోనర్ అన్న వార్తలు వస్తున్నాయి. దీనితో ఈ మూవీ నాని కెరియర్ కు మరింత బూస్ట్ ఇస్తుంది అన్న అంచనాలు మొదలు అయ్యాయి. 

అయితే ఇప్పడు ఈసినిమాకు సంబంధించి ఒక షాకింగ్ న్యూస్ లీక్ అయింది. ఈమూవీలో  హీరో కార్తికేయ నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రను  చేస్తున్న  విషయం తెలిసిందే. ఈసినిమా కథ ప్రకారం కార్తికేయ ఎంట్రీ  ఈ మూవీ ఇంటర్వెల్ బ్లాక్ తరువాత ఉంటుందని సమాచారం. ఈ మూవీ కథరీత్యా కార్తికేయ పాత్ర  కేంద్ర బిందువుగా  ఉంటూ ఈమూవీలోని ఆరు కీలక పాత్రలు  కార్తికేయను  లక్ష్యంగా  పెట్టుకోవడంతో ఈమూవీ సెకండ్ హాఫ్ లో నాని పాత్ర డమ్మీగా మారిపోతుందని టాక్. 

దీనికితోడు విక్రమ్ కుమార్ ఈ సినిమాకు సమకూర్చిన డిఫెరెంట్ స్క్రీన్ ప్లే తో సినిమాను చూసేవారికి కార్తికేయ నెగిటివ్ పాత్రతో పూర్తిగా కనెక్ట్ అవుతారు కాని నాని పాత్రకు అవ్వరు అని అంటున్నారు.   ఒక రకంగా చెప్పాలంటే ఈగలో  సుదీప్ కు ఉన్నంత వెయిటేజ్  ఈ  మూవీలో కార్తికేయకు ఉంటుందని టాక్. 

దీనితో ఈసినిమా విడుదల తరువాత నాని కంటే ఎక్కువగా కార్తికేయకు పేరు వస్తుందని ఈ మూవీ రషస్ చూసినవారు చెపుతున్నారు.  దీనితో  ‘జెర్సీ’ లాంటి ఎమోషనల్ మూవీ తరువాత నాని నటిస్తున్న ‘గ్యాంగ్ లీడర్’ మూవీ నాని కంటే ఎక్కువగా కార్తికేయకు ఎక్కువగా కలిసి వచ్చే ఆస్కారం ఉంది అంటున్నారు.   ప్రస్తుతం ఈ మూవీ హిట్ అవడం దర్శకుడు విక్రమ్  కుమార్ కు చాలా అవసరం అయిన పరిస్థితులలో ఈ మూవీలో నాని పాత్రను మించి కార్తికేయ నెగిటివ్ పాత్ర రేంజ్ ని పెంచి ప్రేక్షకులకు ఒక రెవంజ్ డ్రామాను హ్యూమర్ టచ్ లో చూపించే ప్రయత్నంలో నాని పాత్ర పరిధి తగ్గింది అంటూ వస్తున్న వార్తలు హాట్ టాపిక్ గా మారాయి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: