నయనతార 2005 లో చంద్రముఖి మూవీలో హీరోయిన్ గా రజనీకాంత్ సరసన మెరిసింది. అప్పటినుంచి ఈ అమ్మడు హవా ఓ రేంజిలో ఉంది. ఇండస్ట్రీకి వచ్చి ఇప్పటికి సరిగ్గా పద్నాలుగేళ్ళు అవుతున్నా నయన్ డిమాండ్ మాత్రం ఎక్కడా తగ్గడంలేదు. తమ మూవీలో ఈ అందగత్తె ఉంటే చాలు అనుకుంటున్న హీరోలే అంతా. కుర్ర హీరోల నుంచి సీనియర్ల వరకూ అందరికీ నయనతారే కావాలి. అటువంటి గ్లామర్ ని సొంతం చేసుకున్న నయన్ లేడీ ఓరియెంటెడ్ మూవీలో కూడ తన సత్తా చాటుకుంది.


ఇదిలా ఉండగా కోలీవుడ్‌లో నయన్‌కున్న క్రేజ్ మరో హీరోయిన్‌కు లేదు. ఆ క్రేజ్‌ని నిలబెట్టుకుంటూ ఓవైపు స్టార్ హీరోలతో, మరోవైపు కుర్ర హీరోలతో సినిమాలు చేస్తూనే -లేడీ ఓరియెంటెడ్‌కూ న్యాయం చేస్తోంది నయన్. తమిళంలో అర డజనుకుపైగా సినిమాల్లో నటిస్తున్న నయన్, తెలుగులో మెగాస్టార్‌తో సైరా చేసింది. తాజాగా ఈ బ్యూటీకి వచ్చిన బంపర్ ఆఫర్‌ను తిరస్కరించి సెనే్సషన్ క్రియేట్ చేసింది. ఓ ఫ్రెష్ హీరో పక్కన హీరోయిన్‌గా ఒప్పుకుంటే -పది కోట్ల పారితోషికం ఇస్తామంటూ నిర్మాతలు ఆమెను అప్రోచ్ అయ్యారట. సినిమాకు రెండు, మూడు కోట్లు తీసుకునే నయన్‌కు నిజంగా ఇది భారీ ఆఫరే. అయితే నయన్ మాత్రం -ప్రాజెక్టుకు నో చెప్పిందట.


 ఇదే షాకింగ్ న్యూస్. తమిళంలో కొత్త హీరో శరవణన్‌ను పరిచయం చేస్తూ సినిమా ప్లాన్ చేశారు. క్రేజీ హీరోయిన్‌ని పెట్టుకుంటే మైలేజ్ ఉంటుందని భావించిన దర్శక నిర్మాతలు -నయన్‌ను సంప్రదించారట. ఆ హీరోతో చేయలేనంటూ నయన్ రిజెక్ట్ చేయడమే సెన్సేషన్  అవుతోంది. ‘టెన్ క్రోర్స్’ టాపిక్‌పైనే ఫిల్మ్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. మొత్తానికి నయన్ డిమాండ్ అలా ఇలా లేదన్నది మరో మారు ప్రూవ్ అయింది. మెగస్టార్ తో ఆమె నటించిన సైరా మూవీ ఇపుడు తెలుగులో రిలీజ్ కి సిధ్ధంగా ఉంది. సీనియర్ హీరోలు మళ్ళీ నయన్ తో నటించేందుకు వెంటపడుతున్నారంటే వహ్ వా నయన్ అనిపించకమానదు


ఇపుడున్న పరిస్థితుల్లో నయన్ని తమ మూవీలో తీసుకోవాలని ఏ ప్రొడ్యూసర్ అనుకున్నా, మరే డైరెక్టర్ అనుకున్నా కూడా కుదిరే వ్యవహారం కాదని పది కోట్ల కధతో నయన్ చెప్పేసింది. అలాగే హీరోలు కూడా నయన్ని అప్రోచ్  కావాలంటే ఎలా అన్నదే ఎవరికీ అర్ధం కావడం లేదట మరి.


మరింత సమాచారం తెలుసుకోండి: