విజ‌య్ దేర‌వ‌కొండ సినిమా వ‌చ్చిందంటే చ‌లా యూత్‌లో క్రేజ్ పెరిగిపోతుంది. ఇక తాజాగా నూతన దర్శకుడు భరత్ కమ్మ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'డియర్ కామ్రేడ్'. ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటించారు. ఈ నెల 26న ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది.  విప‌రీత‌మైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుని బాక్సాఫీస్ ద‌గ్గ‌ర సంచ‌ల‌నాలు సృష్టిస్తున్నాడు విజ‌య్‌. అయితే ఈ సినిమాకు ముందు హ‌డావుడి ఓ రేంజ్‌లో చేశారు. అర్జున్ రెడ్డి, గీతా గోవిందం రేంజ్‌లో ఉంటుంద‌ని దీనికి ప్ర‌చారం చేశారు.


అయితే ఈ హ‌డావుడితో విడుద‌లైన డియ‌ర్ కామ్రేడ్ సినిమాపై అంచ‌నాలు కూడా ముందు నుంచి భారీగానే ఉన్నాయి. మొదటివారం పూర్తి కావడానికి ఇంకా రెండు రోజులు ఉండగానే డియర్ కామ్రేడ్ ఇచ్చిన షాక్ మాములుగా లేదు. ప్ర‌పంచ వ్యాప్తంగా 34 కోట్ల‌కు అమ్మిన ఈ సినిమాకు తొలిరోజు 11.5 కోట్ల షేర్ వ‌సూలు చేసినా కూడా ఆ త‌ర్వాత రెండు రోజుల్లో వీక్ అయిపోయింది. ఇంకా ఈ సినిమాకు 16, 17 కోట్ల షేర్ రావాల్సి ఉంది. కానీ నెగిటివ్ టాక్ రావ‌డంతో  రెండో రోజుకే చాలా చోట్ల క‌లెక్ష‌న్స్ భారీగా ప‌డిపోయాయి.


ఇక మరోవైపు యుఎస్ లో మిలియన్ మార్క్ చేరుకోవడానికి క‌ష్ట‌పడుతున్నకామ్రేడ్ ఇప్పుడు కనక అది రీచ్ కాకపోతే వచ్చే సినిమాల ఓవర్సీస్ బిజినెస్ మీద ప్రభావం చూపించడం ఖాయం.  ఈ సినిమాకు వారం రోజుల ముందు విడుద‌ల అయిన `ఇస్మార్ట్ శంక‌ర్‌` క‌లెక్ష‌న్స్ ప‌రంగా దూసుకుపోతుంది. అలాగే ఎలాంటి హడావిడి లేకుండా కేవలం సమంతా అనే బ్రాండ్ ని నమ్ముకుని తీసిన కొరియన్ రీమేక్ ఓ బేబీ అమెరికాలో మంచి హిట్ అయిందంటే మామూలు విష‌యం కాదు.


సోమ‌వారం నుంచి `డియ‌ర్ కామ్రేడ్‌` క‌లెక్ష‌న్స్ డ‌ల్ అయిపోయాయి. ఈ సినిమా డిజాస్ట‌ర్ దిశ‌గా వెళ్తున‌ట్టు క‌నిపిస్తోంది. ఏదేమైన కంటెంట్ ఉంటేనే సినిమా హిట్ అవుతుంది త‌ప్పా.. ముందుగా చేసిన‌ హ‌డావిడి, పబ్లిసిటీ కోసం గొప్పగా ప్రమోట్ చేసుకోవ‌డం వ‌ల్ల‌ ఏం ఫ‌లితం ఉండ‌ద‌ని మ‌రో సారి డియ‌ర్ కామ్రేడ్ ద్వారా స్ప‌ష్ట‌మైంది. దీంతో చాలా రోజుల త‌ర్వాత విజ‌య్ దేవ‌ర‌కొండ ఫ్లాప్ అనే మాట విన‌క త‌ప్ప‌డం లేదు.



మరింత సమాచారం తెలుసుకోండి: