భారత క్రికెటర్ హార్దిక్ పాండ్య, బాలీవుడ్ హీరోయిన్ ఊర్వశి రౌతెలాకు ముడిపెడుతూ యూట్యూబ్‌లో బోలెడన్ని వీడియోలు ఉన్నాయి. తాజాగా ఒక యూట్యూబ్ ఛానెల్ ఊర్వశిని హార్దిక్ పాండ్య మాజీ ప్రేయసి అని పేర్కొంటూ ఒక వీడియోను అప్‌లోడ్ చేసింది. ఈ వీడియోను చూసిన ఊర్వశి తీవ్ర ఆగ్రహానికి లోనైంది. తన ప్రతిష్ఠను దిగజార్చే ఇలాంటి వీడియోలను దయచేసి పోస్ట్ చేయొద్దంటూ యూట్యూబ్ ఛానెళ్లను ఊర్వశి వేడుకుంది. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో అలాంటి ఒక వీడియో స్క్రీన్ షాట్‌ను షేర్ చేసింది. ఇలాంటి వీడియోల వల్ల తన కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదనకు గురవుతారని పేర్కొంది. 


ఆ వీడియో స్క్రీన్ షాట్‌ను ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఉంచిన ఊర్వశి.. ‘‘యూట్యూబ్‌లో ఉన్న మీడియా ఛానెల్స్‌కు నేను ఎంతో విధేయతతో విజ్ఞప్తి చేస్తున్నాను. దయచేసి ఇలాంటి చెత్త వీడియోలను అప్‌లోడ్ చేయడం మానేయండి. నాకొక కుటుంబం ఉంది, వాళ్లకు నేను సమాధానం చెప్పుకోవాలి. ఈ వీడియోలు నాకు సమస్యలు తెచ్చిపెడతాయి’’ అని పేర్కొన్నారు. 


ఒక సహాయం నిమిత్తం ఊర్వశి రౌతెలా తన మాజీ ప్రియుడు, క్రికెటర్ హార్దిక్ పాండ్యాను కలిశారని ఆ వీడియోలో ఉంది. ఇదొక హిందీ మీడియా సంస్థకు చెందిన యూట్యూబ్ ఛానెల్. కాగా, కిందటేడాది ఊర్వశి, హార్దిక్ పాండ్య ఒక పార్టీకి కలిసి వెళ్లారు. పారిశ్రామికవేత్త గౌతమ్ సింఘానియా ముంబైలోని తన బ్రీచ్ క్యాండీ హోమ్‌లో ఈ పార్టీ ఇచ్చారని అప్పట్లో వార్తలు వచ్చాయి. హార్దిక్ పాండ్య సోదరుడు కృనాల్ పాండ్య కూడా ఈ పార్టీకి వచ్చాడు. అయితే, పార్టీలో హార్దిక్ పాండ్యతో ఊర్వశి సన్నిహితంగా మెలగడంతో వాళ్లిద్దరి మధ్య ఏదో ఉందంటూ ప్రచారం జరిగింది. ప్రస్తుతం హార్దిక్ ‘మికీ వైరస్’ నటి ఎల్లి అవ్‌రామ్‌తో డేటింగ్‌లో ఉన్నాడంటూ ప్రచారం జరుగుతోంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: