ప్రస్తుతం తెలుగులో వస్తున్న బిగ్ బాస్ 3 ఇప్పటికీ ఎనిమిదో అయిపోయింది.  అయితే గతంలో వచ్చిన బిగ్ బాస్ 1, 2 సీజన్ల కంటే ఈ సీజన్ చాలా ప్రశాంతంగా జరుగుతున్నట్లు అనిపిస్తుంది. బిగ్ బాస్ మొదలైన తర్వాత రెండు మూడు రోజుల తర్వాత ఇంటి సభ్యుల మద్య చిన్న చిన్న తగాదలే తప్ప పెద్దగా చెప్పుకోతగ్గ గొడవలు ఏమీ రాలేదు.  అయితే మహేష్ విట్టా,  వరుణ్ సందేష్-వితిక ల మద్య వచ్చిన గొడవ పెద్దది అవుతుందని అనకున్నారు ప్రేక్షకులు కానీ.. మహేష్ మంచితనంతో వరుణ్ సందేశ్ వద్దకు వెళ్లి సారీ చెప్పడంతో ఆ గొడవ సమసిపోయింది. అయితే బిగ్ బాగ్ 3 మొదలు కావడానికి ముందు పెద్ద గొడవ జరిగింది.  జర్నలిస్ట్ శ్వేతారెడ్డి, నటి గాయత్రి గుప్త తమను లైంగికంగా బిగ్ బాస్ యాజమాన్యం వేధించారని కాంప్లెంట్ చేశారు. 

ఈ నేపథ్యంలో  పోలీసులు నలుగురిపై కేసులు నమోదు చేశారు. ఈ కేసుకు  స్టార్ మా అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ శ్రీధర్ కు ఆరు ప్రశ్నలతో కూడిన నోటీసులు జారీ చేశారు. తాజాగా ఈ విషయం పోలీసులు అడిగిన ప్రశ్నలకు వారు సమాధానమిచ్చారు. ఇందులో భాగంగా ప్రోగ్రాం డైరెక్టర్, ప్రొడ్యూసర్ ఎవరని ప్రశ్నించగా.. డైరెక్టర్ గా అభిషేక్, నిర్మాతగా ఇండీమోల్ ఇండియా  ప్రైవేట్  లిమిటెడ్ సంస్థలు వ్యవహరిస్తున్నట్లు చెప్పారు. అయితే బిగ్ బాస్ హౌజ్ లోకి వచ్చే కంటెస్టెంట్ల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటామని..ఎలాంటి అనారోగ్యం ఉన్నా, అన్ ఫిట్ అని తేలినా..లేదా ఎలాంటి వ్యసనాలు ఉన్నా అనర్హులుగా ప్రకటిస్తారని అన్నారు.

ఇంటర్వ్యూ విధానం ఇండీమోల్ సంస్థ ప్రొడక్షన్ హౌస్ తో పాటు స్టార్ మా, మెంటల్ అండ్ ఫిజికల్ హెల్త్ అసిస్ట్స్‌ చూసుకుంటారని చెప్పారు. ఇక బిగ్ బాస్ లోకి వంద మంది సభ్యులు రాగా అందులో పబ్లిక్ ఫిగర్స్, సెలబ్రెటీల విషయంపైనే దృష్టి పెట్టామని అన్నారు.  సంస్థలో శ్యాంశంకర్‌ ప్రోగ్రాం డిపార్ట్‌మెంట్‌ ఉపాధ్యక్షులుగా, అభిషేక్‌ ముఖర్జీ ఇండీమోల్‌ క్రియేటివ్‌ కన్సల్టెంట్‌గా, రవికాంత్‌ లీలార్క్‌  క్రియేషన్స్‌ మేనేజర్‌గా, రఘు స్టార్‌ మా పీఆర్వోగా, ఉపాధ్యక్షులుగా ఉన్నారని సమాధానమిచ్చారు. ఈ నేపథ్యంలో ఈ ప్రోగ్రామ్ కోసం ఎంపిక చేసిన వారిని రిజెక్ట్ చేశారనే కోణంతో పాటు ఎవరెవరిని రిజెక్ట్ చేశారో వివరాలు కావాలని కోరినట్లు పోలీసులు స్పష్టం చేశారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: