రామ్ హీరోగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఈ నెల 18్ తేదీన విడుదలైంది ఇస్మార్ట్ శంకర్ సినిమా. సినిమాకు యావరేజ్ టాక్ వచ్చినప్పటికీ ఈ మధ్య కాలంలో సరైన మాస్ సినిమా రాకపోవటం, రామ్ ఈ సినిమాలో అద్భుతంగా నటించటం, నిధి అగర్వాల్, నభా నటేశ్ గ్లామర్ ఇస్మార్ట్ శంకర్ సినిమాను హిట్ చేసాయి.12 రోజుల్లో ఇస్మార్ట్ శంకర్ సినిమా ప్రపంచవ్యాప్తంగా 33 కోట్ల రుపాయల షేర్ వసూలు చేసినట్లు సమాచారం. 
 
ఈ సినిమా కలెక్షన్ల విషయానికి వస్తే నైజాం ఏరియాలో 13 కోట్ల 5 లక్షలు, సీడెడ్ ఏరియాలో 5 కోట్ల 27 లక్షలు, నెల్లూర్ జిల్లాలో కోటీ 3 లక్షలు, కృష్ణా జిల్లాలో కోటీ 85 లక్షలు, గుంటూర్ జిల్లాలో కోటీ 78 లక్షలు, వైజాగ్ ఏరియాలో 3 కోట్ల 50 లక్షలు, ఈస్ట్ గోదావరి జిల్లాలో కోటీ 80 లక్షలు, వెస్ట్ గోదావరి జిల్లాలో కోటీ 55 లక్షలు వసూలు చేసింది. తెలుగు రాష్ట్రాల్లో ఇస్మార్ట్ శంకర్ సినిమా 30 కోట్ల రుపాయల షేర్ వసూలు చేయడం విశేషం. 
 
ఓవర్సీస్లో ఇస్మార్ట్ శంకర్ సినిమా కోటీ 15 లక్షలు వసూలు చేయగా, మిగతా ఏరియాల్లో రెండు కోట్ల 15 లక్షల రుపాయలు వసూలు చేసింది. గత శుక్రవారం డియర్ కామ్రేడ్ సినిమా 
విడుదల కావడంతో ఇస్మార్ట్ శంకర్ సినిమా వసూళ్ళు తగ్గినా డియర్ కామ్రేడ్ సినిమాకు డివైడ్ టాక్ రావటంతో ఇస్మార్ట్ శంకర్ సినిమాకు కలెక్షన్లు పుంజుకున్నాయని తెలుస్తుంది. నిన్న చాలా ఏరియాల్లో డియర్ కామ్రేడ్ వసూళ్ళకు సమానంగా ఇస్మార్ట్ శంకర్ సినిమా వసూలు చేసినట్లు సమాచారం. 
 
ఈ సినిమాకు పూరీ జగన్నాథ్, ఛార్మీ నిర్మాతలుగా వ్యవహరించారు. ఈ సినిమాతో నిర్మాతలకు భారీగా లాభాలు వచ్చినట్లు తెలుస్తుంది. 16 కోట్ల బడ్జెట్తో నిర్మించిన ఇస్మార్ట్ శంకర్ 19 కోట్ల రుపాయల థియేట్రికల్ బిజినెస్ జరుపుకోగా 33 కోట్ల రుపాయల షేర్ వసూళ్ళు సాధించింది. ప్రస్తుతం హీరో రామ్ అమెరికాలో ఉన్నాడు. మరో రెండు రోజుల్లో రామ్ అమెరికా నుండి వచ్చిన తరువాత ఇస్మార్ట్ శంకర్ టీమ్ భారీగా సక్సెస్ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నట్లు సమాచారం. 
 



మరింత సమాచారం తెలుసుకోండి: