తెలుగు రియాల్టీ షో బిగ్ బాస్ సీజన్ 3 ప్రారంభం నుండి పలు వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. అసలు బిగ్ బాస్ 3 ఆగిపోతుందేమో అని కూడా అనుకున్నారు కాని షో ప్రారంభమై వారం దాటేసింది. తొలివారం కంటెస్టెంట్స్ నుండి సీనియర్ నటి హేమ ఎలిమినేట్ అయ్యారు.బిగ్ బాస్ షో నుండి బయటకు వచ్చేటప్పుడు ఎలాంటి ఎమోషన్స్ చూపించకుండా హేమ బయటకు వచ్చి నాగార్జునతో స్టేజిపై మాట్లాడుతూ "నేను ఓ తల్లిలా కిచెన్ లో బిహేవ్ చేశాను.

కాని అది తన తోటి కంటెస్టెంట్స్కి అర్థం చేసుకోకుండా కోపంతో నను బ్యాడ్ అని ఓట్ చేశారే తప్ప ఇంకేమిలేదని,తనని అర్థం చేసుకోని చోట ఉండి లాభం లేదని, కాని చాలా మంచి కంటెస్టెంట్స్ వచ్చారని  అలాగే కంటిస్టెంట్స్ అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ, అక్కా అక్కా నువ్వు తోపు అన్నవారే నన్ను తోసేశారుగా." అంటూ పంచులు కూడా వేశారు హేమ.ఇంటి నుండి బయటకు వచ్చిన తరువాత హేమ తన బాధను మరో రకంగా వ్యక్తం చేస్తున్నారని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.


"బిగ్ బాస్ ఉన్నదివున్నట్లు చూపించడంలేదని,బిగ్ బాస్ నిర్వాహకులు నాపై నిర్లక్ష్యం వహించారని అందుకే ప్రారంభం రోజున తన ఏవీని కూడా వేయలేదని,అలాగే నన్ను ప్రమోట్ చేసేలా వేస్తామన్న ప్రోమో కూడా వేయలేదని,లోపల గొడవ జరిగినప్పుడు నేను సర్ది చెబితే నేను గొడవ చేసినట్టు చూపించారని, కాని తనకు గూగుల్లో ఎక్కువ ఓట్లు వచ్చాయి కానీ హాట్ స్టార్ లో ఓటు వేయాలనే దానిపై క్లారిటీ ఇవ్వలేదు. అలాగే ఇతర కంటెస్టెంట్స్ నన్ను అక్కా అంటూ నాపై లేనిపోని మాటలు చెప్పి అందరూ కలిసి ఓ ప్లాన్ తో బయటకు పంపేశారు." అంటూ హేమ పేరుతో వాట్సప్ మెసేజ్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.మరి త్వరలో స్టార్ మాలో ప్రసారం కాబోయే హేమ ఇంటర్యూలో ఇంకా ఎలాంటి నిజాలు తేలుస్తాయో వేచి చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: