సూపర్ స్టార్ మహేష్ బాబు మొదట 1979లో బాలనటుడిగా దాసరి దర్శకత్వంలో రూపొందిన నీడ సినిమాతో టాలీవుడ్ కి పరిచయం అవడం జరిగింది. అక్కడినుండి వరుసగా పలు సినిమాల్లో బాలనటుడిగా నటించిన మహేష్ బాబు, తన నటనతో తెలుగు ప్రేక్షకుల నుండి మంచి పేరు సంపాదించారు. ఇక ఆ తరువాత బాలనటుడిగా అయన నటించిన చివరి సినిమా బాలచంద్రుడు కూడా మంచి సక్సెస్ సాధించడం, ఆపై కొన్నాళ్లపాటు సినిమాలకు మహేష్ బాబు బ్రేక్ ఇవ్వడం జరిగింది. 

నటన, డాన్స్, ఫైట్స్ వంటి తదితర అంశాల్లో శిక్షణ తీసుకున్న అనంతరం 1999లో కె. రాఘవేంద్ర రావు దర్శకత్వంలో, వైజయంతి మూవీ బ్యానర్ పై అశ్వినిదత్ నిర్మించిన' రాజకుమారుడు' సినిమాతో ఆయన హీరోగా ఎంట్రీ ఇవ్వడం జరిగింది. అయితే హీరోగా అయన నటించిన తొలిసినిమానే సూపర్ డూపర్ హిట్ ని సాధించడంతో, మహేష్ ను అక్కడినుండి అందరూ టాలీవుడ్ ప్రిన్స్ అని పిలవడం మొదలెట్టారు. ఇక ఆ సినిమా అప్పట్లో రూ.5 కోట్లతో నిర్మించబడి, దాదాపుగా రూ.16 కోట్లవరకు కలెక్షన్ సాధించింది. అంతేకాక విజయవాడ లోని అలంకార థియేటర్ లో ఆ సినిమా 100 రోజులు హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో ఆడి, తొలి సినిమాతోనే మహేష్ బాబు బాక్సాఫీస్ పవర్ ని చూపించింది. 

ఇక అక్కడినుండి మెల్లగా ఒక్కొక్క సినిమాతో తన సినిమా ప్రయాణాన్ని ముందుకు తీసుకెళ్లిన మహేష్ బాబు, ప్రస్తుతం టాలీవుడ్ సూపర్ స్టార్ గా కోట్లాది ప్రేక్షకుల గుండెల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించడం జరిగింది. అయితే ఆయన తొలి సినిమా రాజకుమారుడు రిలీజై, నేటికి 20 ఏళ్ళు గడుస్తున్నప్పటికీ, మహేష్ బాబు అదే వన్నె తరగని అందంతో, అలానే అద్భుతనమైన నటనా కౌశలంతో ముందుకు సాగుతున్నారు. రాజకుమారుడు విడుదలై 20 ఏళ్ళు పూర్తి అయిన సందర్భంగా సూపర్ స్టార్ ఫ్యాన్స్, నేడు పలు సోషల్ మీడియా వేదికల్లో హ్యాష్ ట్యాగ్ లతో హడావుడి చేస్తూ, తమ అభిమాన నటుడికి అభినందనలు తెలుపుతున్నారు.....!!   


మరింత సమాచారం తెలుసుకోండి: