బ‌న్నీ సినిమా డైరెక్ట‌ర్‌ను మ‌రో యంగ్ హీరో త‌న్నుకుపోయాడ‌ట‌. ఇదే న్యూస్ ఇప్పుడు ఇండ‌స్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవ‌ల గుణ 369 ట్రైల‌ర్ రిలీజ్ ఫంక్ష‌న్‌లో అల్లు అర‌వింద్ మాట్లాడుతూ బోయ‌పాటి శ్రీనుతో పక్కా యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఓ సినిమా చేస్తాన‌ని ప్ర‌క‌టించారు. అయితే ఆ సినిమాలో అల్లు అర్జున్ హీరో అని అంద‌రూ భావించారు. బ‌న్నీకి బోయ‌పాటి సరైనోడు లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ ఇచ్చాడు. అప్ప‌టి నుంచి బోయ‌పాటిపై అల్లు అర‌వింద్‌కు మంచి గురి ఉంది. ఇక ఇప్పుడు అర‌వింద్ బోయ‌పాటితో సినిమా అన‌గానే అందులో ఖ‌చ్చితంగా బ‌న్నీనే హీరో అని ఫిక్స‌య్యారు. 


అయితే ఇదే స‌మ‌యంలో నిఖిల్ గౌడ్ ఎంట‌ర్ అయ్యాడు.  నిఖిల్ గౌడ్ జాగ్వర్ చిత్రంతో టాలీవుడ్ అండ్ శాండిల్‌వుడ్‌ లలో ఎంట్రీ ఇచ్చి తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం అయ్యాడు. అలాగే నిఖిల్‌ క‌ర్నాట‌క తాజా మాజీ ముఖ్యమంత్రి కుమార స్వామి త‌న‌యుడు అన్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం బోయ‌పాటితో సినిమా చేసి క‌న్న‌డ మ‌రియు తెలుగులో మంచి మార్కెట్ ఏర్ప‌ర్చుకోవాల‌ని ప్ర‌య‌త్నాలు చేస్తున్నాడు. ఎప్పుడూ వరుస ఆఫర్స్ తో బిజీ బిజీగా ఉండే బోయపాటిపై ‘వినయ విధేయరామ’ ప్లాప్ ఎఫెక్ట్ బాగా ప‌డింది. అయితే బోయ‌పాటి త‌ర్వాత సినిమా ఏంట‌నే దానిపై చాలా వ‌ర్త‌లు వ‌చ్చాయి. తాజాగా బోయపాటి – నిఖిల్ గౌడ కాంబినేషన్ లో ఓ సినిమా రాబోతుందనే టాక్ వినిపిస్తోంది.


మ‌రి బోయ‌పాటి నిఖిల్‌తో చేస్తే అల్లు అర్జున్‌తో ఎప్పుడు చేస్తాడు అన్న ప్ర‌శ్న ఉంది. ఇప్ప‌టికే అల్లు అర‌వింద్ అల్లు అర్జున్ హీరోగా బోయ‌పాటి డైరెక్ష‌న్‌లో ఓ సినిమా న‌వంబ‌ర్ నుండి ప‌ట్టాలెక్క‌నుంద‌ని ప్ర‌క‌టించారు. మ‌రి అల్లు అర్జున్‌కు పోటీగా ఆ సినిమాను రిప్లేస్ చేస్తు నిఖిల్ ఎంట్రీ ఇచ్చాడు. కానీ వీరిద్ద‌రి కాంబోలో చేయ‌బోతున్న చిత్రం గురించి ఎలాంటి ప్ర‌క‌ట‌న లేదు. అయితే చాలా గ్యాప్ త‌ర్వాత బోయ‌పాటి చేయ‌బోయే సినిమా అల్లు అర్జున్‌తోనా? లేదా.. నిఖిల్ గౌడ్‌తోనా? అన్న‌ది తెలియాలంటే కొన్ని రోజుల వ‌ర‌కు వేచి చూడాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: