సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు వచ్చినప్పుడే అందిపుచ్చుకోవాలి. లేకపోతే చివరికీ మిగిలేది నిరాశే.  ప్రస్తుత మ్యాటర్ లోకి వెళ్తే.. ఆ మధ్య సోషల్ మీడియా  సెన్సేషన్ హీరోయిన్ గా మారింది మలయాళ బ్యూటీ  ప్రియా ప్రకాష్ వారియర్. దాంతో ఈ అమ్మడికి మొదట్లో   కొన్ని ఆఫర్లు వచ్చినా..  అమ్ముడికి ఆశ ఎక్కువై భారీగా  రెమ్యునరేషన్ ను  డిమాండ్ చేసింది. దాంతో వచ్చిన ఆఫర్లు కాస్త దూరమైపోయాయి. ఇక ఆ తరువాత ఆమె హీరోయిన్ గా నటించిన 'ఓరు అదార్ లవ్' చిత్రం  'లవర్స్ డే' పేరుతో తెలుగులోకి  డబ్ అయి ఫ్లాప్ కావడంతో  ఆమె ఆశలకు బ్రేకులు పడ్డాయి.  

దాంతో ఈ యంగ్ బ్యూటీకి తత్త్వం బోధపడింది. ఇచ్చినంతే పుచ్చుకుంటా  ముందు మీ సినిమాలో  ఛాన్స్ ఇవ్వండి అని గత కొన్ని నెలలుగా  అందర్నీ అడుగుతుందట. అయినా ఈ సోషల్ మీడియా హీరోయిన్ ను మలయాళంలో ఎవ్వరూ పెద్దగా పటించుకునట్లు కనబడట్లేదు. అందుకే ఆమె తెలుగు ఇండస్ట్రీనే టార్గెట్ చేసుకుంది. ఎలాగూ దక్షిణాదిన ఇతర భాషల్లో ఒకటి రెండు సినిమాలు చేసి  మంచి ఫేమ్ తెచ్చుకున్న హీరోయిన్లు నెక్స్ట్ టార్గెట్ చేసేది తెలుగు సినిమా పరిశ్రమే.  

అలా వచ్చిన వారే సాయి పల్లవి, అనుపమ పరమేశ్వరన్, రష్మిక మందన్న.  ప్రస్తుతం వీరి కెరీర్ టాప్ గేర్లో ఉంది.  వీళ్ళ మాదిరిగానే  ప్రియా ప్రకాష్ వారియర్ సైతం పయనించాలని ఆశ పడుతుంది. ఈ క్రమంలోనే నితిన్  కొత్త సినిమాలో ఆమె రెండో కథానాయకిగా ఛాన్స్ కొట్టేసింది.  ఇప్పుడు మరో తెలుగు  సినిమాలో కూడా నటించబోతుందట. అఖిల్  హీరోగా రాబోయే సినిమాలో కూడా ఈ భామను ఓ కీలక పాత్రలో నటించనుందట.

 నిజానికి అప్పట్లో ప్రియా వారియర్ కి ఓ బడా స్టార్ హీరో సినిమాలో మంచి లీడ్ హీరోయిన్ రోల్ కూడా వచ్చింది. కానీ సడెన్ గా వచ్చిన ఫేమ్ తో.. ఒక్కసారిగా బాలీవుడ్ లో బడా హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిపోవాలని కలలు కంది. వచ్చిన అవకాశాలను కాదనుకుంది. చివరకి పెద్ద అవకాశాలు రాకపోగా.. అమ్మడికి ప్లాప్ లు ఎదురయ్యాయి. దాంతో వచ్చిన ఫేమ్ అంతా ఆ పరాజయాలతోనే కొట్టుకుపోయింది.  మొత్తానికి ప్రియా చివరికీ చిన్న చిన్న రోల్స్ కూడా ఒప్పుకుంటుంది. పాపం ప్రియా.. అందుకే అంటారు దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అని.

మరింత సమాచారం తెలుసుకోండి: