జక్కన్న తలుచుకుంటే టాలీవుడ్ లో ఇప్పుడున్న స్టార్ హీరోయిన్ ఎవరైనా ఎగిరి గంతేసి తన సినిమాలో నటించడానికి కావల్సినన్ని కాల్ షీట్స్ ఇచ్చేస్తారు. కానీ ఎందుకనో ఆర్.ఆర్.ఆర్ మొదలైనప్పటి నుంచి తారక్ కి జోడీ సెట్టవడం లేదు. ఈ విషయంలో జక్కన్నకు ఎప్పటికప్పుడు షాకులు తగులుతూనే ఉన్నాయని ఫిల్మ్ నగర్ సమాచారం. ‘బాహుబలి’ సినిమాతో అంతర్జాతీయ మార్కెట్‌ను ఆకర్షించిన దర్శకధీరుడు రాజమౌళి తాజాగా తెరకెక్కిస్తున్న మరో భారీ బడ్జెట్ సినిమా ‘RRR’. ఈ సినిమాలో ఇద్దరు స్టార్ హీరోలు యంగ్ టైగర్ ఎన్టీర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌లు నటిస్తున్నారు. ఇక హీరోయిన్ల విషయానికొస్తే.. చెర్రీ సరసన బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నటిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే జూనియర్ ఎన్టీఆర్ సరసన ఎవరు నటిస్తారా..? అనేదే ఇప్పుడున్న పెద్ద సస్పెన్స్. 

ఎన్టీఆర్‌కు జోడీగా ముందుగా బ్రిట‌న్ నటి డైసీ ఎడ్గర్గ్ జోన్స్‌ను హీరోయిన్‌గా ఎంపిక చేశారు జక్కన్న. కానీ కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల ఆ నటి తప్పుకొని బ్రిటన్ వెళ్ళిపోయింది. దీంతో జక్కన్నకు షాక్ తగిలినంతపనైంది. అయితే తాజాగా.. అమెరిక‌న్ న‌టి, సింగ‌ర్ ఎమ్మా రాబ‌ర్ట్స్‌ను రాజమౌళి ఎంపిక చేసుకున్నార‌ని పెద్ద ఎత్తున వార్తలు వినిపించాయి. దీంతో తారక్ పక్కన నటించే హీరోయిన్ దొరికేసిందని చిత్రబృందం.. మరోవైపు తారక్ అభిమానులు ఆనందంలో మునిగితేలారు. అయితే ఆ ఆనందం పట్టుమని పది రోజులు కూడా లేకుండా పోయిందనేది లేటెస్ట్ అప్‌డేట్.

అయితే ఎక్కువ రోజులపాటు షూటింగ్‌లో పాల్గొనలేనని.. అన్ని రోజులు తేదీలు ఇవ్వలేనని తేల్చిచెప్పిన ఎమ్మా రాబర్ట్స్‌ RRR నుంచి తప్పుకుంటున్నట్లు తేల్చిచెప్పిందట. దీంతో జక్కన్నకు మరో ఊహించని షాక్ తగిలింది. ఇలా అందరూ వరుసగా తప్పుకుంటుడంతో అయ్యో.. RRR కే ఎందుకిలా జరుగుతోందని చిత్రబృందం ఆలోచనలో పడిందట. అయితే మరో ఇంగ్లిష్ భామ కోసం జక్కన్న వేట మొదలుపెట్టారని టాక్ నడుస్తోంది. మరి ఈసారైనా ఎన్టీఆర్‌కు జోడీ సెట్ అవుతుందా..? లేదా..? అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే. అయితే ఎందుకు హాలీవుడ్ కు చెందిన హీరోయిన్ కోసమే జక్కన్న అంతగా ట్రై చేస్తున్నారు...ఇక్కడ తమన్న, సమంత, పూజా హెగ్డే తో పాటు మరికొంతమంది బాలీవుడ్ టాప్ హీరోయిన్స్ కూడా ఉన్నారుగా అన్న పెద్ద సందేహం టాలీవుడ్ లో చాలా మంది మనసుల్లో మెదులుతోంది. మరి దీనికి సమాధానం జక్కన్న ఏమనిస్తారో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: