టాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కి గత కొన్ని సంవత్సరాల నుండి సరైన హిట్ సినిమా లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. ఇటువంటి నేపథ్యంలో తాజాగా పూరి జగన్నాథ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని తో కలిసి తెరకెక్కించిన 'ఇస్మార్ట్ శంక‌ర్' సినిమా చాలా సంవత్సరాల తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీ లో మాస్ తరహాలో సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ రేంజ్ లో పూరి జగన్నాథ్ కి హిట్ పడటంతో ఇండస్ట్రీలో పూరి జగన్నాథ్ పేరు మార్మోగిపోతోంది. ప్రస్తుతం ఈ సినిమాకి వస్తున్న కలెక్షన్లు లెక్కలు విని చాలా మంది ఇండస్ట్రీలో ఉన్న ట్రేడ్ వర్గానికి చెందిన వారు ఆశ్చర్యపోతున్నారు. వరుస విజయాలతో దూసుకుపోతున్న డైరెక్టర్లకు రానీ కలెక్షన్..జగన్ సినిమా హిట్ అవడంతో వస్తున్న కలెక్షన్లు చూసి చాలామంది నోటి మీద వేళ్ళు ఏసుకుంటున్నట్లు ఫిలిం నగర్ లో వార్తలు వినబడుతున్నాయి.


దీంతో సినిమా సూపర్ డూపర్ హిట్ కావడంతో ఇటీవల సక్సెస్ సంబరాల్లో పాల్గొన్న పూరి జగన్నాథ్ కి ఇండస్ట్రీ నుండి రామ్ చరణ్ తేజ్, ప్రభాస్, రానా, మరియు మెగాస్టార్ చిరంజీవి ఇంకా చాలా మంది హీరోలు ఫోను చేసి అభినందనలు తెలిపారు అని ఇటీవల పూరి పేర్కొనడం జరిగింది. అయితే ఇటువంటి క్రమంలో మహేష్ పూరి జగన్నాథ్ కి అభినందనలు తెలపకపోవడం ఇప్పుడు ఇండస్ట్రీలో పాటు సోషల్ మీడియాలో పెద్ద హాట్ టాపిక్ అయింది. అయితే పూరి జగన్నాథ్ గతంలో మహేష్ పై చేసిన కామెంట్లకు మహేష్ సీరియస్ గా తీసుకున్నట్లు ఇందుమూలంగానే మహేష్ బాబు పూరి జగన్నాథ్ కి అభినందనలు చెప్పలేదని...చాలామంది అంటున్నారు.



కొన్ని వారాల క్రితం 'ఇస్మార్ట్ శంక‌ర్' ప్రమోషన్ కార్యక్రమాల్లో పూరి జగన్నాథ్ మాట్లాడుతూ ...మహేష్ బాబు పై సంచలన కామెంట్ చేయడం జరిగింది . మీడియా మిత్రులు ఆ సమయం లో మహేశ్ తో సినిమా ఏమైంది అంటూ అడిగారు .. దానికి  పూరీ కూడా ఆస‌క్తిక‌ర‌మైన స‌మాధానం చెప్పాడు. " మ‌హేష్ బాబు కంటే నాకు ఆయ‌న ఫ్యాన్స్ చాలా ఇష్టం.. మీరు మా హీరో తో  సినిమా ఎప్పుడు చేస్తున్నార‌ని ప్ర‌తీసారి అడుగుతూనే ఉంటాడు.. మీకు కూడా తెలుసు మ‌హేష్ కోసం జ‌న‌గ‌ణ‌మ‌న స్క్రిప్ట్ సిద్ధం చేసాన‌ని " అని చెప్పాడు పూరీ జ‌గ‌న్నాథ్. కానీ అంతటితో ఆగకుండా పూరీ కొన్ని వ్యాఖ్యలు చేశాడు .. "మ‌హేష్ బాబుకు తాను హిట్ల‌లో ఉన్న‌పుడు మాత్ర‌మే గుర్తుంటాన‌"ని చెప్పాడు. దీంతో వివాదం పెద్దది అయ్యింది. అయితే తాజాగా హిట్ పడటంతో ఈ వివాదం కారణంగా మహేష్ బాబు పూరి జగన్నాథ్ చేసిన కామెంట్స్ సీరియస్ గా తీసుకున్నట్లు ప్రస్తుత పరిణామాలను బట్టి తెలుస్తుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: