ఇప్పటికే ప్రేక్షకుల మదిని దోచి అదిరిపోయే హిట్టు, కలెక్షన్లను కొల్లగొట్టిన ‘అత్తారింటికి దారేది’ సినిమాలో అదిరిపోయే కొత్త సీన్లను కొత్తగా జత చేసి ప్రదర్శించనున్నారు. ఈ మేరకు ఫిల్మ్ మేకర్లు ఈ  ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే మంచి కుటుంభకథా చిత్రంగా మార్కులు కొట్టేసిన ఈ సినిమాలో ఈ కొత్త సీన్లు మరింత పేరు తెచ్చిపెడుతుందంటున్నారు.

ఈ సినిమా ఎడిటింగ్ సంధర్భంగా తొలగించిన కొన్ని సీన్లను జత చేయనున్నారు. ఇవి కడుపుబ్బ నవ్వించే కామెడి సీన్లు, చక్కటి ఎంజాయ్ మెంట్ ను కలిగించే ఎంటర్ టైన్ మెంట్ సీన్లు అంటున్నారు. దీంతో ఇప్పటికే కలెక్షన్లలో టాలీవుడ్ లో నెంబర్ వన్ స్థానం కొట్టేసి దానిని ఎవరు చేరుకోరు అన్న సిచువేషన్ క్రియేట్ చేసిన ఈ సినిమా ఇక ఎవరికి అందనంత రికార్డు కొట్టడం ఖాయం అంటున్నాయి సినిమావర్గాలు.

త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ‘అత్తారింటికి దారేది’ లో పవన్ హీరోగా అదరగొట్టగా, సమంత, ప్రణీతలు పవన్ కు మరదళ్లుగా నటించి తెలుగు ప్రేక్షకుల మదిని దోచుకున్నారు. దేవిశ్రీ తన సంగీతంలో అందరిని తన్మయులను చేసారు. ఇక కామెడి, ఎంటర్ టైన్ మెంట్ తో మరింత రంజింప చేయనుంది ‘అత్తారింటికి దారేది’.

 

మరింత సమాచారం తెలుసుకోండి: