సామాన్య పేద ఓటర్లు డబ్బుకు అమ్ముడు పోతున్నారంటూ,వారికి కొవ్వెక్కిందా...? అని పద్యాలు రాసిన, రచయిత అనంత శ్రీరామ్‌ 'గుణ 369' కోసం రాసిన ఈ పాట సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. సభ్య సమాజానికి ఏమి మెసేజ్‌ ఇవ్వాలని ఈ బూతు సాహిత్యం రాశావ్‌ అనంతం..?

ఈ పాట రాసినందుకు నువ్వు ఎంతకు అమ్ముడు పోయావ్‌?

నీకంటే సామాన్య ప్రజలే నయం కదా ? అని నెటిజన్లు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఆయన రాసిన పాటలో కొన్ని చరణాలు ఇవి.... 

అతడు: నమ్మలేక నమ్మాలేక నన్ను గిచ్చుకుంటున్నా నొప్పి పుట్టి ఎక్కళ్లేని సంతోషంలో తుళ్లుతున్నా

ఆమె: నవ్వలేక నవ్వాలేక పొట్ట పట్టుకోనా పిచ్చిపట్టి నువ్వేసే చిందుల్నే చూస్తున్నా

అతడు: తప్పదింక భరించవే నా బంగారం బుజ్జి బుజ్జి బంగారం నీ వయ్యారం చల్లుతుంది తీపి కారం

ఆమె: నా బంగారం బుజ్జి బుజ్జి బంగారం నీ యవ్వారం తెంచుతుంది సిగ్గుదారం

చరణం 1 అతడు: సొంత ఊరిలో కళ్ల ముందరే కొత్త దారులెన్నో పుట్టాయే

ఆమె: అంతేలేరా జంటగుంటే అంతే లేరా

అతడు: సొంత వారితో ఉన్న నిన్నలే గుర్తురాము పొమ్మనన్నాయే

ఆమె: జతలో పడితే జరిగే జాదూ ఇదేగా ముద్దులెన్నో పెట్టాలిగా పెట్టి గాల్లో పంపాలిగా ఊపిరంతా గంధమైపోయేంతగా

అతడు: ముందుకొచ్చే ఉన్నానుగా ఎందుకమ్మా ఇంకా దగా నన్ను మళ్లీ మళ్లీ ఊరించేంతగా

ఆమె: తప్పదింక భరించరా నా బంగారం బుజ్జి బుజ్జి బంగారం

నీ యవ్వారం మించిపోతే పెద్ద నేరం నా బంగారం బుజ్జి బుజ్జి బంగారం నీ వయ్యారం పెట్టమాకు అంతదూరం

చరణం 2 అతడు: ఉన్న జన్మనీ ముందు జన్మనీ చుట్టి ఇచ్చినాను నీ ఇష్టం

ఆమె: అడెడే అదిగో ముదిరే పైత్యం అదేలే ఎన్నో ఎన్నో అన్నారులే ఎన్నో ఎన్నో విన్నాములే వట్టి మాటల్లోనే ఎన్నో వింతలే

అతడు: సర్లే సర్లే చెప్పావులే సందు సందు తిప్పావులే వచ్చి చేతల్లోనే చూపిస్తా భలే

ఆమె: తప్పదింక భరించనా నా బంగారం బుజ్జి బుజ్జి బంగారం నీ యవ్వారం నచ్చుతుంది శుక్రవారం అతడు: నా బంగారం బుజ్జీ బుజ్జీ బంగారం నీ వయ్యారం గుచ్చుతుంది పూలహారం..''

ఇలా పూర్తవుతుంది అనంతం గారి ముదిరిన పైత్యం...

మరింత సమాచారం తెలుసుకోండి: